5G Smart Phones | స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో హస్తభూషణం.. ప్రతి ఒక్కరూ మెరుగైన ఫీచర్లు, సెల్ఫీలు దిగడానికి మంచి లెన్స్ కెమెరా కావాలనుకుంటారు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం ఉండాలని ఆకాంక్షిస్తుంటారు. అదీ కూడా కాస్త బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉండాలని ఆశిస్తుంటారు. భారతీయ స్మార్ట్ ఫోన్ యూజర్ల ఆకాంక్షలకు అనుగుణంగా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు బడ్జెట్ క్యాటగిరీ, మిడ్ క్యాటగిరీ, టాప్ హై ఎండ్ క్యాటగిరీల్లో స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి. ఇప్పడు దేశవ్యాప్తంగా 5జీ సేవలు క్రమంగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో రూ.15 వేల లోపు విలువ గల 6జీబీ రామ్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా 5జీలో కొత్త స్మార్ట్ ఫోన్ ‘లావా బ్లేజ్ 5జీ’ దేశీయ మార్కెట్లోకి త్వరలో తీసుకు రానున్నది. ఈ ఫోన్ ఫీచర్లు ఇవీ.
మరో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. భారత్ మార్కెట్లోకి పొకో ఎం4 5జీ ఫోన్ తెచ్చింది. దీని స్పెషిఫికేషన్లు ఇలా..
దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. దేశీయ మార్కెట్లోకి హాట్20 5జీ వేరియంట్ ఫోన్ తీసుకొచ్చింది. రూ.13,499లకే ఈ ఫోన్ అందుబాటులో ఉంది.. ఈ ఫోన్ ఫీచర్లు
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి ఎం13 5జీ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్లో స్పెషిఫికేషన్లు ఇలా..
దేశీయ స్మార్ట్ ఫోన్ సంస్థ ఇన్ఫినిక్స్.. మార్కెట్లోకి నోట్12 5జీ ఫోన్ తీసుకొచ్చింది. దీని ఫీచర్లు ఇవీ..