బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Aug 19, 2020 , 02:45:33

ట్రాక్టర్‌పై కలెక్టర్‌ పర్యటన

ట్రాక్టర్‌పై కలెక్టర్‌ పర్యటన

మునిపల్లి : నడవడానికి వీలులేకుండా మారిన బురద రోడ్డుపై సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు ట్రాక్టర్‌పై వెళ్లి వైకుంఠధామం పనులు పరిశీలించారు. మంగళవారం మునిపల్లి మండలంలోని కుర్దు గ్రామ శివారులో నిర్మిస్తున్న వైకుంఠధామ పనులు పరిశీలించేందుకు కలెక్టర్‌ వెళ్లారు.  రోడ్డు పూర్తిగా బురదమయంగా మారడం తో అటుగా వెళ్తున్న ట్రాక్టర్‌పై   సిబ్బందితో కలిసి వెళ్లి పనులు పరిశీలించారు. పనులు నాణ్యతగా సకాలంలో పూర్తయ్యేలా కృషి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. అభివృద్ధి పను ల్లో ని ర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  బుధేరా శివారులో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.


logo