ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jul 22, 2020 , 23:10:33

ఠాణా ప‌చ్చ‌ద‌నానికి ఠికానా

ఠాణా ప‌చ్చ‌ద‌నానికి ఠికానా

సిర్గాపూర్‌ పోలీస్టేషన్‌ను చూస్తే.. పచ్చదనమంటే ఇలా ఉండాలి.. కూర్చుంటే చల్లని ఆ పచ్చిగడ్డిపైనే కూర్చుండాలి.. ఇది ఠాణానా? బృందావనమా? అన్న అనుభూతి కలుగక మానదు. అతిగా అనిపించినా.. ఇది ముమ్మాటికీ నిజం. సిర్గాపూర్‌ పోలీస్టేషను ఆవరణలో పరుచుకున్న పచ్చదనం చూపరులను అబ్బురపరుస్తున్నది. 

సిర్గాపూర్‌: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలతో సిర్గాపూర్‌ పోలీసు ఠాణా ఆవరణలో పచ్చదనం సంతరించుకుంది. నాలుగేండ్లలో హరితహారం మొక్కలు పెరిగి చల్లని వాతావరణాన్నిస్తూ ఆహ్లాద పరుస్తున్నాయి. ఠాణా ప్రహరీ చుట్టూ హరిత వనం తలిపిస్తున్నది. ఐదు విడుతల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పోలీసు సిబ్బంది సంరక్షించడంతో ఏపుగా పెరిగాయి. ఠాణా కార్యాలయం ఎదుట కొబ్బరి, టేకు, తదితర పండ్లు పూల మొక్కలు వాటి సొబగులు చూపరులకు ఎంతో ఆకర్షిస్తున్నాయి. వాటి చుట్టూ కంచె వేయడంతో మొక్కలు పెరిగి ప్రస్తుతం చెట్లుగా మారి పచ్చని అందాలను తలపిస్తున్నాయి. ఠాణా చుట్టూ మైదానంలో దాదాపు ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, వాటి నీడ, చల్లని వాతావరణంతో నెలకొంది. ఠాణా పనిమీద ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడి చెట్ల కింద విశ్రమిస్తుంటారు.


logo