బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Mar 15, 2020 , 00:04:35

కల్యాణం..కమనీయం

కల్యాణం..కమనీయం

రామచంద్రాపురం: తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో లక్ష్మీ అనంత పద్మనాభస్వామి కల్యాణం శనివారం రాత్రి కనుల పండువగా జరిగింది. పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం స్వామివారికి అభిషేకం, వరుణ పూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, యాగషాల ప్రవేశం, హోమాలు, ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయం త్రం స్వామివారి కల్యాణం సందర్భంగా ఏర్పాటు చేసిన మం డపం, ఆలంకరణ, విద్యుత్‌ దీపాలతో సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెలిమెల గ్రామంలో మూడు రోజులపాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వెలిమెల 16,17 వార్డుల కౌన్సిలర్లు ఓగ్గు సుచరిత కొమురయ్య, పట్లోళ్ల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కౌన్సిలర్లు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

కల్యాణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ లలితాసోమిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రాములుగౌడ్‌, కౌన్సిలర్లు బాలాజీ, శ్రీశైలం, నాగరాజు, లచ్చిరాం, చిట్టి ఉమేశ్వర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మల్లారెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ పుష్పానగేశ్‌, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్‌, గ్రామ అధ్యక్షుడు నాగిరెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రవీణ్‌, శ్రీధర్‌, గోపాల్‌, యాదగిరి యాదవ్‌, నవీన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, దయాకర్‌, బాల్‌రాజ్‌, సురేశ్‌ పాల్గొన్నారు.


స్వామివారి విశిష్టతను వివరించిన మాడుగుల  

స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ ముఖ్యఅతిథిగా హాజరై శ్రీలక్ష్మీ అనంత పద్యానాభ స్వామి చరిన్రు, విశిష్టతను భక్తులకు వివారించారు. 


logo