రంగారెడ్డి, మే 16(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను గురువారం వర్షం ముంచెత్తింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో 194.7మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సరూర్‌నగర్‌లో 33.7మి.మీలు కురిసింది. శంకర్పల్లి ప్రాంతంలో వాగులు, మురు గుకాల్వలు పొంగిపొర్లాయి. కడ్తాల్ మండలంలోని వాసుదేవ్‌పూర్‌లో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. ధారూరు మండలంలోని నాగారంలో కురిసిన వానకు కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయ్యింది. వడ్లు నీళ్లలో పైకి తేలా యి. చేవెళ్లలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌గౌడ్ ఎండబెట్టిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. అదేవిధంగా షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోకుండా ఉం డేందుకు అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షాల నేపథ్యంలో అధికార యం త్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. భారీ వర్షాలతో వాతావరణ శాఖ రంగారె డ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజానీకం ఇండ్లను వదిలి బయటకు రాలేదు.
జిల్లాలో గురువారం సాయంత్రమే 194.7మి.మీల వర్షం కురువగా.. జిల్లా సగటు వర్షపాతం7.2మి.మీలుగా నమోదైంది. సరూర్‌నగర్‌లో అత్యధికంగా 33.7 మి.మీ లు, గండిపేటలో 29.5మి.మీలు, రాజేంద్రనగర్‌లో 28.6మి.మీలు, హయత్ నగర్లో 27.7మి.మీలు, శేరిలింగంపల్లిలో 20.9మి.మీలు, శంకర్‌పల్లిలో 13.4మి. మీలు, చేవెళ్లలో 7.7మి.మీలు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 6.9మి.మీలు, ఇబ్రహీంపట్నంలో 5.2మి.మీలు, కేశంపేటలో 4.5మి.మీలు, శంషాబాద్‌లో 4.3మి.మీలు, మొయినాబాద్‌లో 3.5మి.మీలు, కందుకూరులో 3.3మి.మీలు, మహేశ్వరంలో 2.5మి.మీలు, ఫరూఖ్‌నగర్, నందిగామలలో 0.8మి.మీలు, ఆమనగల్లు, బాలాపూర్‌లలో 0.5మి.మీలు, కడ్తాల్‌లో 0.4మి.మీ.ల వర్షం కురిసింది.