చేవెళ్లటౌన్ : ఈ నెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెకు ( General strike ) కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి పిలుపునిచ్చారు. దేశవ్యాపిత సమ్మెలో భాగంగా గోడపత్రిని ( Strike Poster ) ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ( Narendra Modi ) మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పై దాడి మొదలు పెట్టాడని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పెట్టుబడిదారి వర్గానికి కొమ్ము కాస్తూ నాలుగు కోడ్లుగా మార్చారని ఆరోపించారు. 8 గంటల పని దినాలను సాధించుకున్న కార్మికులకు మోదీ ప్రభుత్వం 12గంటల పని దినాలను తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ విధానాన్ని కార్మిక వర్గం ప్రతిఘటించాలని కోరారు. పెరుగుతున్న అధిక ధరలను అదుపు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమయంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యం ప్రభులింగం, పార్టీ మండల కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్, ఏఐటీయూసీ మండల అధ్యక్ష , కార్యదర్శులు శివ, డప్పు శివ, గీత పని వాళ్ల సంఘం మండల కార్యదర్శి కృష్ణా గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.