కొత్తూరు, మే 16: బతుకాలనే కోరిక.. ఆపద సమయంలో సమయస్ఫూర్తి.. ప్రాణం మీదకు వస్తున్నా భయకుండా ఆ కార్మికుడు చాకచక్యంగా వ్యహరించంతో తృటిలో మృత్యు ఒడి నుంచి పయటపడ్డారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. కార్మికుడి సయస్ఫూర్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..అది కొత్తూరు మున్సిపాలిటీలోని తిమ్మాపూర్ రైల్వే జంక్షన్. పెద్ద జంక్షన్ కావడంతో ప్యాంసింజర్ రైళ్లతోపాటు గూడ్సు రైళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి.
అయితే శుక్రవారం సాయంత్రం బిహార్‌కు చెందిన కార్మికుడు రైల్వే ట్రాక్ దాటుతున్నాడు. ఈ సమయంలో గూడ్స్ రైలు అకస్మాత్తుగా కదిలింది. దీంతో ఆ కార్మికుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన కార్మికుడు రైల్వే ట్రాక్ మధ్యలో పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత తాపీగా లేచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృష్యాన్నంతటిని గుర్తుతెలియన వ్యక్తి వీడియో తీసీ సోషన్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ కార్మికుడి సమయస్ఫుర్తి నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇప్పుడు మీడియాల్ వైరల్ గా మారింది.