Womens Day | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని గార్డెన్ కాలనీలో సంక్షేమ సంఘం మహిళల విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కేక్ కట్ చేశారు. కాలనీలోని పిల్లలకు మ్యూజికల్ చైర్స్, ఇతర ఆటలు నిర్వహించారు. శనివారం పిల్లలుచేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మహిళలు, పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శారద, దివ్య, ధనమ్మ, స్వాతి, స్రవంతి, హరిత, జయమ్మ, బిందు, అర్చన, వెంకటలక్ష్మి, రమాదేవి, సుజాత, గీత తదితరులు పాల్గొన్నారు. గార్డెన్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి.