ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన మహిళా దినోత్సవ సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి,క్షీరాభిషేకాలు చేసిన మహిళలు
ఆయా నియోజకవర్గాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు
పలుచోట్ల మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం
పరిగి, మార్చి 6 :టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తొలి రోజు మహిళా దినోత్సవాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జరిగిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి, క్షీరాభిషేకాలు చేశారు. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అన్న నినాదాలు సంబురాల్లో మిన్నంటాయి. పారిశుధ్య కార్మికులు, మహిళా ఎస్ఐలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులు, వైద్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో జరిగిన సంబురాల్లో మంత్రి సబితారెడ్డి పాల్గొని మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కేశంపేట్ మండలం వేములనర్వలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వేడుకల్లో పాల్గొనగా, పరిగి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. తాండూరు పట్టణం, యాలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పాల్గొని మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం మహిళాబంధు సంబురాలు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. మహిళా ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టారు. పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టారు. తాండూరు పట్టణం, యాలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పాల్గొని మహిళా ఉద్యోగులను సన్మానించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, ఎస్ఐలు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులను సన్మానించారు.
రంగారెడ్డి జిల్లాలో ..
షాబాద్, మార్చి 6 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొదటి రోజు నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. రంగారెడ్డిజిల్లాలో ఆదివారం మహిళా దినోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించారు. షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమనగల్లు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, క్షీరాభిషేకాలు నిర్వహించారు. గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులు, వైద్యులు, ప్రతిభగల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కేశంపేట్ మండలం వేములనర్వలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొనగా, ఆమనగల్ ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొని వైద్యసిబ్బందిని ఘనంగా సన్మానించారు. నందిగామ మండల కేంద్రంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వ ప్రోత్సాహం
షాద్‌నగర్, మార్చి 6 : నేటి పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆర్కే పురం కిన్నెర గ్రాండ్హాల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మ హిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ ఘాట్, టూరిజం రాష్ట్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ కల్నల్ సంతోష్బాబులతో కలిసి వేడుకలు నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు సీఎం కేసీఆర్ షీ టీమ్స్‌ను ప్రవేశపెట్టారన్నారు. పారిశ్రామిక రంగంలోనూ రాణించేవిధంగా ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తున్నదని చెప్పారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. అనంతరం కేక్‌ను కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.