కొందుర్గు, మార్చి 10 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్లో గల ఎస్ఎస్ గార్డెన్లో జడ్పీటీసీ స్వరూప ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు పెద్ద పీట వేశారని అన్నారు.
మహిళల కోసం కళ్యాణలక్ష్మి, షాదీమూబాకర్ వంటి పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, సీడీపీఓ నాగమణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్,తదితరులు పాల్గొన్నారు.