వికారాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం సంక్షోభంలో పడిపోయిం ది. అన్ని వర్గాల వారిని సర్కార్ గాలికి వదిలేస్తున్నది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు గత ప్రభుత్వం 200 గురుకుల పాఠశాలలను వెయ్యికి పెంచగా.. వాటిపై రేవంత్ ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కేసీఆర్ హయాంలో ఆ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కట్టగా .. ప్ర స్తుతం ఆ బడుల్లో చేరేందుకు కూడా విద్యార్థులు ముందుకు రావడం లేదు.
అక్కడ అరకొర సౌకర్యాలు ఉంటాయని.. ఆ బడుల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయిందని, పురుగుల అన్నం పెడుతారని.. గురుకులాల పేరు ఎత్తితేనే స్టూడెంట్స్ హడలిపోతున్నారు. గత 19 నెలలుగా ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో ఏదో ఒక ఘటన జరుగుతు న్నా రేవంత్ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడకపోవడం శోచనీయం. కాంగ్రెస్ పాలన లో ప్రభుత్వ గురుకులాల నిర్వహణకు నిధు లు ఇవ్వకపోవడంతోపాటు పర్యవేక్షణ లో పించడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫుడ్ పాయిజన్, ఎలుకలు, పాముకాటు ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలు, పురుగుల అన్నం.. నీళ్ల చారు తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లలో పారిశుధ్యం కూడా అధ్వా నంగా తయారై విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు.
గురుకులాలను విస్మరించిన సర్కార్
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ వసతిగృహలు, కేజీబీవీలు, గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియ మించారు. అయితే, 19 నెలల కాంగ్రెస్ పాలనలో గురుకులాలను పూర్తిగా విస్మరించారు. ఇప్పటికే పలు చోట్ల వరుసగా ఫుడ్ పా యిజన్ ఘటనలు జరిగినా తూతూ మంత్రం గా దిద్దుబాటు చర్యలు చేపట్టి చేతులు దులుపుకొన్నారే తప్పా హాస్టళ్ల సంక్షేమాన్ని మా త్రం పట్టించుకోలేదు. దీంతో అన్నంలో పురుగులు రావడం, నీళ్ల చారు, నాసిరకం భోజనంతో విద్యార్థులు రోగాలబారిన పడుతున్నా రు.
రెండు రోజుల కిందట మర్పల్లి మండలంలోని కేజీబీవీ, ఎస్సీ బాలుర వసతిగృహాల్లో పురుగులతో కూడిన భోజనాన్ని మధ్యాహ్నం అందించడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ధర్నా చేశారు. మర్పల్లిలోని కేజీబీవీ, సిరిపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలోనూ పురుగుల అన్నం పెడుతున్నారని, మెనూను పాటించడం లేదని.. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు పురుగులన్నం విషయం చెప్పడంతో వారు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశా రు. అయితే విద్యార్థులకు అందించే గుడ్లు, పండ్లను హాస్టళ్లలో పనిచేసే సిబ్బందే మా యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
అయితే ఒక్క మర్పల్లిలోనే కాదు జిల్లాలోని ఒకట్రెండు వసతిగృహాలు మినహా అన్ని హాస్టళ్లలోనూ ఈ పరిస్థితులే ఉన్నాయి. అలాగే, నవాబుపేట మండల కేంద్రంలోని కేబీబీవీలో చదువుతున్న 8 మంది విద్యార్థినులను గత ఫిబ్రవరి నెలలో ఎలుక కరిచిం ది. తల్లిదండ్రులకు తెలిసి వారు ఆందోళన చేపట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిం ది. పారిశుధ్యం లోపించడంతోనే పెద్ద సంఖ్య లో ఎలుకలు, ఇతర విష పురుగులు ప్రభు త్వ వసతిగృహాలు, కేజీబీవీల్లోకి వస్తున్నట్లు విద్యార్థినులు పేర్కొంటున్నారు.