తాండూరు, డిసెంబర్ 27: అన్ని రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని రైల్వేబోర్డు ప్రయాణికుల సౌకర్యాల కల్పన బృందం సభ్యులు తెలిపారు. మంగళవారం వారు తాండూరు రైల్వేస్టేషన్‌ను పరిశీలించి.. అక్కడి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని సూచించారు. ఇతర పలు అంశాలపై స్థానిక నేతలు, ప్రయాణికుల విజ్ఞప్తులను బృందం సభ్యులు స్వీకరించారు. ఈ సందర్భంగా రైల్వే బోర్డు ప్రయాణికుల సౌకర్యాల కల్పన బృందం సభ్యులు రవిచంద్రన్, ఉమారాణి, మధుసూదన్, నిర్మల, కిశోర్, దిలీప్‌కుమార్, కైలాస్, లక్ష్మణ్‌వర్మ, అభిజిత్ తదితరులు మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ర్టాల్లో పర్యటించి దాదాపు 450 రైల్వేస్టేషన్ల పరిశీలించినట్లు తెలిపారు. తాండూరు స్టేషన్లో ఆర్థిక విధానాల అమలు, ఆదాయ పురోగతి, రైల్వే ప్రాంగణాల నిర్వహణ, భద్రతా చర్యలు, ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులపై వారు సంతృప్తి వ్య క్తం చేశారు. పలు స్టేషన్లలోని మైనర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశామ ని.. మేజర్ సమస్యల పరిష్కారానికి రైల్వే బోర్డుకు నివేదికను పంపుతామని బృందం సభ్యులు తెలిపారు. ప్రయాణికుల కోరిక మేరకు పలు చోట్ల హా ల్టింగ్కు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా రైల్వే ఆవరణలను శుభ్రంగా ఉంచాలన్నారు.
వికారాబాద్, డిసెంబర్ 27: వికారాబాద్ రైల్వేస్టేషన్‌లోని సమస్యలను పరిష్కరించాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాద య్య రైల్వేబోర్డు ప్రయాణికుల సౌకర్యా ల కల్పన బృందం సభ్యులకు తెలిపారు. మంగళవారం బృందం సభ్యులు వికారాబాద్ రైల్వేస్టేషన్‌ను పరిశీలించేందుకు రాగా ఆయన వారికి వినతిపత్రాన్ని అం దించారు. వికారాబాద్ రైల్వేస్టేషన్ పక్క నే ఉన్న లాలాగూడ నుంచి బస్టాండ్ వరకు నడక వంతెనను ఏర్పాటు చేయాలని..వికారాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఉన్న అన్ని స్టేషన్లల్లో హాల్టింగ్ వసతిని కల్పించాలని ఆ వినతిపత్రంలో కోరారు. ఆయన వెంట ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు.