ఓటరు జాబితాలోమీ పేరుందా?
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్‌స్థాయి అధికారి (బీఎల్వో) ఉంటారు. వారి వద్ద ఈ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ఉంటుంది. వాటిని పరిశీలించి ఓటు ఉందా.. లేదా ? చూసుకోవచ్చు.
- ఇతరుల ఓట్లు మీ ఇంటి నంబర్‌పై ఉన్నాయా?
- కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
- ఇవన్నీ సులభంగా తెలుసుకోవచ్చు
- అందుబాటులో యాప్, వెబ్సైట్లు
- ఈ వివరాలన్నింటినీ తెలుసుకోండిలా..
ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య ద్వారా..
http//voterportal.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్’ కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మీ ఫొటో గుర్తింపు కార్డు సంఖ్యను ఎంటర్ చేయాలి. జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నది. సీరియల్ నంబర్ ఎంత? వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య తెలియకపోతే ‘అడ్వాన్స్ సెర్చ్’ కాలంలోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా…? తెలుసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రాల ద్వారా..
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్‌స్థాయి అధికారి (బీఎల్వో) ఉంటారు. వారి వద్ద ఈ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ఉంటుంది. వాటిని పరిశీలించి ఓటు ఉందా.. లేదా ? చూసుకోవచ్చు.
- ఓటరు జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు ఇలా..
- బీఎల్వోకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- బీఎల్వోకు ఫారం-6 ద్వారా సమర్పించవచ్చు.
- ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాల్లో ఇవ్వొచ్చు.
ప్రతి నియోజకవర్గానికి డివిజన్‌స్థాయి అధికారిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్వో)గా, ప్రతి మండలంలోనూ తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఏఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. వారు విచారణ జరిపి ఓటు హక్కు కల్పిస్తారు.
పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా చూసుకోవచ్చు
http//ceo.telangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే పై భాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అసెంబ్లీ, నియోజకవర్గం అని కనిపిస్తుంది. వాటిపై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. ఆ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తారో చూసుకుని దానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి మీ పేరుందా? లేదా? చూసుకోవచ్చు.
ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి..
www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్లి ముందుగా మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. ‘రిజిస్టర్ యాజ్ ఏ న్యూ ఓటర్’ అని ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫారం-6 అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ ఓటర్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆన్లైన్ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నింటినీ నింపి సబ్మిట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు రిఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. ఆన్లైన్ చేసుకున్న దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్‌స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేర్చుతారు.
ఈవీఎంలపై సంచార వాహనంతో అవగాహన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం)పై ఓటర్ల అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం సంచార వాహనంతో ప్రచారం చేస్తోంది. అక్టోబర్ 28 వరకు ఓటర్లకు ఈవీఎం, వీవీ ప్యాట్ల పనితీరుపై అవగాహన కల్పించనున్నది. అచ్చం పోలింగ్ బూత్‌లో ఉన్న మాదిరిగానే ఓటు వేసేందుకు ఈవీఎం, వీవీ ప్యాట్, మానిటర్ ఉంటాయి. నీలి రంగు బటన్ నొక్కగానే వీవీ ప్యాట్‌లో ఒక పేపర్ కనిపిస్తుంది. దానిపై ఓటు ఏ గుర్తుకు వేశారో తెలుస్తుంది. ఈ నమూనా ఓటును మనమూ వేయవచ్చు.
హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో..
గూగుల్ ప్లే స్టోర్‌లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నంబర్ వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. యాప్‌లోకి ప్రవేశించిన వెంటనే పైభాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్ ఎలక్టోరల్ రోల్’ అనే కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్’, సెర్చ్‌పై ఎలక్టోరల్ నంబర్’ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండింటికి సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరుందా.. లేదా తెలుసుకోవచ్చు. మీ పేరు, తండ్రి పేరు, వయస్సు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపర్చడం ద్వారా జాబితాలో పేరు ఉందా?లేదా? తెలుసుకోవచ్చు. అదేవిధంగా http//ceotelangana.nic.in వెబ్సైట్లోకి వెళ్లి ఎన్వీఎస్పీ ఓటరు పోర్టల్ వెబ్సైట్ లింక్‌లోకి వెళ్లి కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు సహా ఇతరత్రా ఏమైనా సందేహాలుంటే 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
మీ పేరు, వివరాల నమోదు ఇలా..
www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్తే ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డిటెయిల్స్’, ‘సెర్చ్ బై ఎలక్టోరల్ నంబర్’ అనే రెండు ఆప్షన్లు వస్తాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు లేదా ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఎంటర్ చేస్తే మీ పేరు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు.
ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పని చేస్తుంది. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా తెలుసుకుని.. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోండి.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

