కులకచర్ల, జూన్ 6 : కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి బోనాలు శుక్రవారం ఘనం నిర్వహించారు. పోతరాజుల వేశాధారణలో భారీగా బోనాలతో ఊరేగింపుగా నిర్వహిస్తూ అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపు కొనసాగించారు. డీజే సౌండ్‌తో అమ్మవారి పాటలతో ఎల్లమ్మ తల్లికి బోనాల ప్రదక్షిణ నిర్వహించారు.
భారీ సంఖ్యలో అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లమ్మ తల్లి మమ్ము చల్లంగా ఉంచు తల్లిఅంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాల మహిపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్‌రావు, గ్రామ పెద్దలు బాలకిష్టారెడ్డి, మోర వెంకటేశ్, బాల్‌రెడ్డి, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.