Vikarabad : డీసీసీబీ ద్వారా అన్నిరకాల రుణాలను అందజేస్తున్నాం..

కులకచర్ల : డీసీసీబీ ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలను అందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో డీసీసీబీ ఆధ్వర్యంలో సాల్వీడ్ గ్రామానికి చెందిన నర్సింహులుకు డీసీసీబీ రుణంతో ట్రాక్టర్ మంజూరు చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీబీ ద్వారా వివిధ రకాల రుణాలు అందిస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతుల కోసం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. గతంలో వ్యవసాయం అంటేనే రైతులు ఇబ్బందులు పడేవారని నేడు రైతులకు రైతుబంధు, రైతుబీమా ద్వారా రైతులు ధీమాతో వ్యవసాయాన్ని చేస్తున్నారని తెలిపారు.
డీసీసీబీ ద్వారా జిల్లాలో రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపించి రైతును ఆనందింప చేశారు. కార్యక్రమంలో కులకచర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, కులకచర్ల పీఏసీఎస్ డైరెక్టర్ నర్సింలు, కొండయ్య, టీఆర్ఎస్ నాయకులు జోగు వెంకటయ్య, మాలెకృష్ణయ్యగౌడ్, లక్ష్మణ్, వెంకటయ్య, బిచ్చయ్య, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

