e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home రంగారెడ్డి Vikarabad : బీజేపీపై భగ్గుమన్న టీఆర్‌ఎస్.. ధాన్యం కొనుగోళు చేయాలని ధర్నా

Vikarabad : బీజేపీపై భగ్గుమన్న టీఆర్‌ఎస్.. ధాన్యం కొనుగోళు చేయాలని ధర్నా

తాండూరు : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ.. టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండల టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలతో వినూత్నంగా శవయాత్ర తీసి దహనం చేశారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యతిరేఖ నినాదాలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ ఢిల్లీలో ఒకమాట.. రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతుందన్నారు. వడ్ల కొనుగోలుపై బీజేపీ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌ గట్టిగా మాట్లాడి బట్టబయలుచేశాక రాష్ట్రంలో బీజేపీ నేతలు వేరే మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సర్కార్‌ రైతులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ఎన్ని కుట్రాలు పన్నిన ఫలితం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వానకాలం వడ్ల కొనుగోళ్లు ప్రారంభించిందని తెలిపారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లు కొనాలని కేంద్రం మీద వత్తిడి తెచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ధర్నాలు చేపడితే బీజేపీ ఎక్కడ వెనుకబడి పోతుందననే ఆందోళనతో రాష్ట్ర నాయకులు పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

టీఎస్ఎంఎస్ఐడిసీ చైర్మన్‌ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారుల ఆలోచనలకు పదునుపెట్టి రైతులకు ఎప్నటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చరిత్రలో పదిలంగా నిలిచే విధంగా గతంలో ముందెన్నడూ లేని విధంగా రైతులకు ప్రత్యేక సమావేశాలు, సలహాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ చక్కటి ఆలోచనలతో రైతు వేదికలు నిర్మించారని వెల్లడించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement