Vikarabad : మానవాళికి ఆదర్శం వాల్మీకి జీవితం
- వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
- జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు

పరిగి : మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని వికా రాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో వెనుకబడిన తర గతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం వేట గాడుగా ఉన్న వాల్మీకి దొంగగా మారి దారి దోపిడీలు చేశారని, ఆ తర్వాత నారద మహా ముని దివ్యోపదేశంతో కొన్ని సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారన్నారు. ఆ తర్వాత రామాయణ కావ్యాన్ని రచించారని చెప్పారు. మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరు అని నిరూపించింది వాల్మీకి మహ ర్షి అని తెలిపారు.
వాల్మీకి మహర్షి జీవితం మానవులకు ఆదర్శప్రాయమని, ఆయన జీవితాన్ని ముందు తరాలకు తెలియజేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రక మహ నీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ, వారిని స్మరించుకుంటుందని తెలిపారు. బీసీ కమీషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు మహర్షులవుతారని, వాల్మీకి మహర్షి చరిత్ర ఇందుకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని పుష్పలత, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా స్థాయి అధికారులు, వాల్మీకి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

