వికారాబాద్ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారుల వత్తిడి చేస్తున్నారని జిల్లాలోని పలువురు ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు వికారాబాద్ జిల్లా కేంద్రం డీఎంహెచ్‌వో కార్యాలయం ముందు గురువారం నిరసన చేశారు. పని వత్తిడి, సమయం తగ్గించాలని కోరుతూ 200మంది ఏఎన్ఎంలు నిరసనలో పాల్గొన్నారు.
సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌కు, డీఎంహెచ్‌వో తుకారామ్లకు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కో కన్వినర్ కులకచర్ల సీహెచ్‌వో చంద్రప్రకాశ్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.