పరిగి : స్వామి వివేకానందుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని అన్నారు. యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని, ఆయన అడుగుజాడల్లో నడువాలన్నారు.
స్వామి వివేకానందుడికి నివాళులర్పించిన వారిలో ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంగు సంతోష్‌కుమార్, సీనియర్ నాయకులు వెంకటయ్య, కౌన్సిలర్లు వేముల కిరన్, ఎదిరె కృష్ణ, వారాల రవీంద్ర, మునీర్, టీఆర్ఎస్ నాయకుడు రవికుమార్, శ్రీశైలం, ఎంఈవో హరిశ్చందర్, పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమర్నాథ్, మండల స్వామి వివేకానంద యువజన సంఘాల అధ్యక్షుడు పర్శమోని బాబు, నాయకులు శ్రీశైలం, అనిల్‌కుమార్, వెంకటయ్య, బాబు ఉన్నారు.