దోమ : మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి దోమ జడ్పీటీసీ నాగిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు నూతనంగా స్థాపించిన బొడ్రాయిని దర్శించుకున్నారు. ఈ మహాపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి రూ. 51వేల విరాళం అందజేశారు. ధ్వజ ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నధాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు.
మండల కేంద్రంలో మూడు రోజులుగా బొడ్రాయి పున:ప్రతిష్టాన, ధ్వజస్తంభ స్థాపన తదితర కార్యక్రమాలు నేటితో ముగిశాయి. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ అనిత, ఎంపీపీ అనుసూయ, వైస్ ఎంపీపీ మల్లేశం, మండల రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మయ్య ముదిరాజ్, గ్రంథాల డైరెక్టర్ యాదయ్యగౌడ్, కో-ఆప్షన్ ఖాజాపాషా, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామ ఆర్ఎస్ఎస్ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.