కోట్‌పల్లి : రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం కోట్‌పల్లి మండల నూతన మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిలుగా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవీ, ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, ఆనంద్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పని చేస్తుందని, రైతుకు విత్తనాలను మొదలుకోని పంట దిగుబడిలోనూ మద్దతు ధరను కల్పించడంలో రైతు వెన్నంటే ఉండి రైతాంగాన్ని అభివృద్ధికి నిరంతరం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని గుర్తు చేశారు.
గత పాలక వర్గం కోట్‌పల్లి మార్కెట్ కమిటీ గోడౌన్ నిర్మాణం కోసం నివేదికను అందించారని, అది కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని మంత్రి దృష్టికి నూతన పాలకవర్గ సభ్యులు తేగా.. స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత శాఖతో మాట్లాడారు. డిసెంబర్ 28న మంజూరీ చేస్తామని చెప్పారని, ఇక నూతన మార్కెట్ కమిటీ గోడౌన్ నిర్మాణం చేసి రైతులకు ఇబ్బందులు తీర్చాలని కోరారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతుల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెల్లె విధంగా నూతన పాలకవర్గం పని చేయాలని సూచించారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలనే వేసుకుని లాభాలు పొందేలా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యమకారులకు మంచి గౌరవం దక్కిందని మంత్రి సంతోషంతో శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలోని ఆరు పంచాయతీల అభివవృద్ధికి 90లక్షల డీఎంఎప్టీ నిధులను కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. కోట్‌పల్లి ప్రాజెక్టు వాటర్‌ను రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రి మోడలింగ్ కోసం రూ. 110 కోట్లు నిధులకు నివేదికను పంపించామని, రాగానే రైతు సాగుకు ఇక నీటి ఇబ్బందులు ఉండవని, రైతు పొలాల్లో బంగారం వంటి పంటలను పండించి రైతు కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సభ్యులు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మండల అధ్యక్షుడు అనిల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, వైస్ ఎంపీపీ మల్ల ఉమాదేవీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.