వికారాబాద్, ఫిబ్రవరి 15 : ఆంగ్లంపై పట్టు.. ఉన్నతికి మెట్టు అనివికారాబాద్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ అ న్నారు. ఇంటర్ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పట్టు సాధించేందుకు ఈ ఏడాది నుంచి ఇంటర్ బోర్డు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈనెల 16 నుంచి జరుగనున్న ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాలని గురువారం ఓ ప్రకటన లో సూచించారు. ఈ నెల 16న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్ మొదటి ఏడాది ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష 20 మార్కులకు జరుగుతుందన్నారు.
అదేవిధంగా ఈ నెల 17న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ అనే పరీక్షను ఇంతకుముందు రాయని విద్యార్థులకు మాత్రమే ఉంటుందన్నారు. ఇంటర్ మొద టి ఏడాది చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులకు ఎథిక్స్ పరీక్ష ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పర్యావరణ విద్య పరీక్ష ఈ నెల 19న ఉద యం 10 నుంచి 1 వరకు జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులను ఫెయిల్ అయినట్లుగా ప్రకటించ డం జరుగుతుందన్నారు. హాల్ టికెట్లను చదువుతున్న కళాశాలల నుంచే తీసుకోవాలని సూచించారు.