
పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక భరోసానిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నది. పేదల కుటుంబాల్లో ‘కల్యాణ’కాంతులు నింపేందుకు రూ.లక్షా 116 సాయం అందజేస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 2,465 మందికి కల్యాణలక్ష్మి, 406 మందికి షాదీముబారక్ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం సాయమందించింది. తెలంగాణ సర్కార్కు రుణపడి ఉంటామని ఆడబిడ్డల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్, ఆగస్టు 9: పేదింటి ఆడపిల్లల పెండ్లి చేయడానికి వారి తల్లిదండ్రులు తిప్పలు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రారంభించారు. అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుండడంతో వారు అప్పులు లేకుండా తమ బిడ్డల పెండ్లి చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 సం వత్సరంలో రూ. 51వేలు అందించగా, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో 2017 లో రూ. 75,116 ఇచ్చారు. 2018 లో రూ. లక్షా 116కు పెంచారు. రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు మొత్తం 2,465మందికి కల్యాణలక్ష్మి ద్వారా, 406 మందికి షాదీముబారక్ ద్వారా ఆడబిడ్డల పెండ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. జిల్లాలోని చేవెళ్ల డివిజన్లో కల్యాణలక్ష్మి ద్వారా 404 మందికి, షాదీ ముబారక్ ద్వారా 28 మందికి, షాద్నగర్ డివిజన్లో కల్యాణలక్ష్మి ద్వారా 312 మందికి, షాదీముబారక్ ద్వారా 40 మందికి, ఆమనగల్లు డివిజన్లో కల్యాణలక్ష్మి ద్వారా 539 మందికి, షాదీముబారక్ ద్వారా 24మందికి, ఇబ్రహీంపట్ంనం డివిజన్లో కల్యాణలక్ష్మి ద్వారా 1210 మందికి, షాదీముబారక్ ద్వారా 314 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. మరి కొంతమంది లబ్ధిదారుల దరఖాస్తులు తహసీల్దార్, ఎమ్మెల్యేల వద్ద పరిశీలనలో ఉన్నట్లు, త్వరలో వారికి కూడా ఆర్థిక సాయం అందజే య నున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పెండ్లి చేసిన వెంటనే దానికి సర్టిఫి కెట్లు జతచేసి మీ-సేవాలో దరఖాస్తులు చేసి రెవెన్యూ కార్యాలయంలో అందజేస్తు న్నారు. అక్కడి నుంచి పై అధికారుల వద్ద పరిశీలన తర్వాత లబ్ధిదారులకు ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నారు.
నా కూతురు పెండ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. అప్పులు చేసి పెండ్లి ఎలా చేయాలోనని ఇబ్బందులు పడే సమయంలో కేసీఆర్సార్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. లక్షా 116 అందించి మా కుటుంబానికి అండగా నిలిచారు. పెండ్లిలకు పైసలు ఇయ్యడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.
-స్వరూప, సర్దార్నగర్(షాబాద్)
ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా పెండ్లిలకు ఆర్ధిక సాయం అందించడం సంతోషకరం. గత 70 ఏండ్ల పాలనలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంకా పేద ప్రజల కోసం ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తుంది. నా బిడ్డ పెండ్లి చేశాను. సర్కార్ నుంచి రూ. లక్షా 116 అందించారు. ఆడబిడ్డల పెండ్లిలకు మేనమామగా ఆదు కుంటున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు .
-లలిత, ఊరేళ్ల(చేవెళ్ల)
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద ప్రజలకు ఓ వరంగా మారాయి. ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే అనేక ఇబ్బం దులు పడే తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అం దించి అండగా నిలువడం గొప్ప పరిణామం. అన్ని వర్గాల సం క్షేమానికి పాటు పడుతున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రజ లు ఎప్పటికీ మరిచిపోరు. ఇలాంటి పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
-అరుణ, చందిప్ప(శంకర్పల్లి)
చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్, చేవెళ్ల, మొ యి నాబాద్, శంకర్పల్లి మం డలాలకు సంబంధించి ఈ ఏడా ది కల్యా ణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా మొ త్తం 944 దర ఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటివరకు 432 మందికి రూ. లక్షా 116 చొప్పున సాయం అందించాం. మిగతా వారి దరఖాస్తులు కూడా పరిశీలనలో ఉన్నాయి. త్వరలో వారికి కూడా సాయం అందనుంది.
– వేణుమాధవ్రావు, ఆర్డీవో చేవెళ్ల