తాండూరు : మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని శ్రీబాలాజీ మందిరంలో డిసెంబర్ 6 నుంచి 8వ తేది వరకు మూడు రోజులు ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ శిబిరము నిర్వహించనున్నట్లు మార్వాడి యువమంచ్ అధ్యక్షుడు సన్నీఅగర్వాల్, కార్యదర్శి గోవింద్ అసావా తెలిపారు. ఈ శిబిరం కరపత్రలు, వాల్ పోస్టుర్లను ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆవిష్కరింపజేశారు.
ఈ సందర్భంగ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ శిబిరంలో 200మందికి జైపూర్ కృత్రిమ కాళ్ల అమరిక, పోలీయోగ్రస్తులకు కెలిపర్స్ అమర్చనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.