సీఎం సభకు భారీగా తరలిన శ్రేణులు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వ హించిన సీఎం కేసీఆర్ సభకు తాండూరు నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్సులో సీఎం కేసీఆర్ సభకు వెళ్లారు. తాండూరు నుంచి వికా రాబాద్ వరకు వాహనాల రాకపోకలు భారీగా జరగడంతో అంతా టీఆర్ఎస్ మ యంగా కనిపించింది. సీఎం కేసీఆర్ ప్రసంగంలో తాండూరు గురించి మాట్లాడడంతో
తాండూరు, ఆగస్టు 16: వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వ హించిన సీఎం కేసీఆర్ సభకు తాండూరు నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్సులో సీఎం కేసీఆర్ సభకు వెళ్లారు. తాండూరు నుంచి వికా రాబాద్ వరకు వాహనాల రాకపోకలు భారీగా జరగడంతో అంతా టీఆర్ఎస్ మ యంగా కనిపించింది. సీఎం కేసీఆర్ ప్రసంగంలో తాండూరు గురించి మాట్లాడడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ జై టీఆర్ఎస్…జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ అభిమానాన్ని చాటారు.
కులకచర్ల, ఆగస్టు 16: వికారాబాద్‌లో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు కులకచర్ల, చౌడాపూర్ మండలాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, మహిళలు భారీ సం ఖ్యలో తరలి వెళ్లారు. కులకచర్ల ప్రధాన చౌరస్తా నుంచి వాహ నాలను సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి టీఆర్ఎస్ జెండా ఊపి ప్రారంభించారు. కులకచర్ల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, చౌడాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్తినేని సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ చైర్మన్ నాగ రాజు, చౌడాపూర్, కులకచర్ల మండలాల టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీగా ప్రజలు సీఎం సభకు తరలివెళ్లారు.
కొడంగల్, ఆగస్టు 15: కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు టీఆర్ఎస్ పార్టీ అభి మానులు ప్రత్యేక వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివెళ్లారు.
మర్పల్లి, ఆగస్టు 16: మర్పల్లి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఐదు వందలకు పైగా వాహనాలలో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
దోమ, ఆగస్టు 16: వికారాబాద్ బహిరంగ సభకు దోమ మండల టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మండల పరిధిలోని 36 గ్రామ పంచాతీలతో పాటు అనుబంధ గ్రామాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు నాయకులు భారీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మయ్యముదిరాజ్, ప్రచార కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తరలి వెళ్లారు.
కోట్‌పల్లి, ఆగస్టు 16 : వికారాబాద్ లో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధికసంఖ్యలో తరలి వెళ్లారు. జిన్నారం గ్రామంలో బందెయ్య ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. బార్వాద్ తండా, కొత్తపల్లి, రాంపూర్, కోట్‌పల్లి, బార్వాద్ తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

