ఆమనగల్లు, డిసెంబర్ 3ః ఆమనగల్లు మున్సిపాలిటీ 8 వార్డు సభ్యురాలు కమటం రాధమ్మ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను సన్మానించారు. రాధమ్మ జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యురాలిగా నియామకమైన సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ని కలిశారు. అనంతరం రాధమ్మకి ఎమ్మెల్యే శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నిట్టనారాయణ, టీఆర్ఎస్ నాయకులు బన్సీలాల్, ఆంజనేయులు, రూపం వెంకట్రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.