చేవెళ్ల రూరల్, మే 25 : శంకర్పల్లి మండలం కొండకల్, వెలిమెల తండా శివారులోని గిరిజనులు తమ 80 ఎకరాల బిలాదాకల భూముల ఆక్రమణలపై చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 135వ రోజుకు చేరాయి. ఆదివారం దీక్షలో పాల్గొన్న భూ బాధితులు మాట్లాడుతూ.. మా భూములు మాకు తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
దీక్షలో పి.లక్ష్మణ్, రవి, శంకర్, బాబు, లక్ష్మణ్, చందర్ రెడ్డి, గోపి, సోనిబాయి, వసుంధర, తులసి, గోమా, మున్న, శంకరమ్మ, మాణెమ్మ, పి.కవిత, వెంకటయ్య, శాంతయ్య, కొండకల్ మాజీ వార్డు సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మర్రివాగు రాజు, తండా వాసులు, తదితరులు పాల్గొన్నారు.