సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): నంబర్ ప్లేట్ లేని వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను శాంతి భద్రతల పోలీసులకు అప్పగిస్తున్నారు. దీంతో వారు ఆ వాహనాలు, వాహనదారుల గత చరిత్ర గు రించి ఆరా తీసుస్తున్నారు. అసలు, నంబర్ ప్లేట్ వాడకపోవడానికి చెబుతున్న కారణాల్లో వాస్త వం ఎంత ఉందనే విషయంపై దృష్టి పెట్టా రు. 15 రోజులుగా హైదరాబాద్లో నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్యాంపరింగ్ నంబర్ కలిగిన వాహనాలు, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తాత్కాలిక నం బర్తో తిరుగుతున్న బండ్లను పోలీసులు పట్టుకుంటున్నారు. రెండువైపులా నంబర్ ప్లేట్ లేకుం డా తిరిగే వాహనదారులు నేరాలు చేసేందుకు ఎక్కువ అవకాశముండటంతో అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల నార్త్జోన్లో నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఆపి న ఎస్సైపై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన తెలిసిందే. నిందితులు నేర స్వభావం ఉన్నవారు కావడంతోనే నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారనే విషయం మరోసారి స్పష్టమైంది.
డీసీపీలకు లేఖలు..
ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటున్న వాహనాలు, వాహనదారుల విషయంలో గత చరిత్రను తనిఖీ చేయాలని, తద్వారా వారి నేర చరిత్ర బయటకు వచ్చే అవకాశాలుంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ డీసీపీలకు లేఖలు రాశారు. దీంతో ఆయా పోలీస్స్టేషన్లకు ట్రాఫిక్ పోలీసులు అప్పగిస్తున్న నంబర్ ప్లేట్ లేనివి, ట్యాంపరింగ్ చేసిన వాహనాలపై వారు దృష్టి పెట్టారు. వాహనాల అసలు నంబర్ ఏమిటీ, పట్టుబడ్డ వారి గత చరిత్ర, వాహనం ఎవరిది..? ఎక్కడుంటున్నారు..? ఎప్పటి నుంచి నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారనే విషయాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.