రంగారెడ్డి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యా నిఫెస్టోలో ప్రకటించిన పింఛన్ల హామీని గాలికొదిలేసింది. తాము అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. పవర్లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటికీ వాటి పెంపు ఊసే ఎత్తక పోవడంతో జిల్లాలోని పింఛన్‌దారులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ. 4016లను రూ.6,016, వృద్ధులు, వితంతువులు ఇతరుల పింఛన్లను రూ.2,016-రూ.4,016 లకు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి వాటి పెంపుపై నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పింఛన్లను పెంచాలని ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పింఛన్‌దారులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
జిల్లాలో 2,08,344 మంది పింఛన్‌దారులు..
జిల్లాలో 2,08,344 మంది పింఛన్‌దారులున్నారు. వారిలో వృద్ధులు 84,836 మంది, దివ్యాంగులు 28,087, వితంతువులు 85,469, చేనేతలు 842, గీత కార్మికులు 2,399తోపాటు ఇతర పింఛ న్ దారులున్నారు. వారిలో వృద్ధులకు ప్రస్తుతం 2,016 పింఛన్ ఇస్తుండగా.. దానిని రూ.4,016 పెంచుతామని, దివ్యాంగుల పింఛన్‌ను రూ. 4016 రూ. 6016కు పెంచుతామని, వితంతువులు, గీత, నేత పింఛన్ దారులకు కూడా భారీగా పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ హామీ ఇచ్చి.. వారి ఓట్లతో విజయం సాధించింది. తీరా గద్దెనెక్కి 20 నెలలు దాటినా ఇప్పటికీ రూపాయీ పెంచలేదు. ఇప్పటికే పింఛన్ల పెం పుపై దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు ఆందోళనలు చేపట్టినా పట్టించుకోవడంలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం..
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇతరుల పింఛన్లను వెంటనే పెంచాలి. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తాను కాంగ్రెస్ పార్టీకి చూపుతాం. గత ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి వృ ద్ధుల పింఛన్‌ను రూ.4,016, దివ్యాంగులను పింఛన్‌ను రూ. 6016లకు, గీత, నేత, వితంతువుల పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. హామీని అమలు చేసి..లబ్ధిదారులను ఆదుకోవాలి.
-కాళ్ల జంగయ్య, వీహెచ్పీహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు