వీడని చిక్కుముళ్లు రుణమాఫీలో సమస్యలు యథాతథం
జిల్లాలో రుణమాఫీ సంబురం ఒక్క రోజుకే పరిమితమైనది. రూ.లక్ష రుణమాఫీకి సం బంధించి ఒక్క రోజే రైతుల బ్యాంకు ఖాతా ల్లో మాఫీ డబ్బులను జమచేయగా..ఆ తర్వా త ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
- పోర్టల్ చూసి కారణాలు చెప్పడం మినహా..సమస్యలకు పరిష్కారం చూపని అధికారులు
- వారం రోజులు అవుతున్నా..పూర్తిస్థాయిలో జమకాని రూ.లక్ష రుణమాఫీ డబ్బులు
- జాబితాల్లో పేర్లున్నా.. నేటికీ తప్పని ఎదురు చూపులు
రంగారెడ్డి, జూలై 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రుణమాఫీ సంబురం ఒక్క రోజుకే పరిమితమైనది. రూ.లక్ష రుణమాఫీకి సం బంధించి ఒక్క రోజే రైతుల బ్యాంకు ఖాతా ల్లో మాఫీ డబ్బులను జమచేయగా..ఆ తర్వా త ఆ ప్రక్రియ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో మాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కావడంలేదు. దీంతో రైతాంగం గత వారం రోజులుగా వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదు. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసింది. రైతులు ఆధార్ కార్డు ఇస్తే..పోర్టల్‌లో చెక్ చేస్తున్న అధికారులు రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను చెబుతున్నారు. తప్పితే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
రెండురోజులకే పరిమితమైన మాఫీ మురిపెం ..
రంగారెడ్డి జిల్లాలో 49,741 మంది రైతులకు రూ.278.06 కోట్ల రుణమాఫీని చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయా జాబితాలను బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు పంపించారు. రూ.లక్ష రుణమాఫీ ప్రక్రియను ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభించారు. మొదటి, రెండు రోజుల్లో మాత్రమే కొంతమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమఅయ్యాయి. ఆ తర్వాత మాఫీ ప్రక్రియ నిలిచిపోయింది.
రుణమాఫీ జాబితాల్లో పేర్లు వచ్చిన రైతులకు సైతం కొంతమందికి వారివారి ఖాతాల్లో మాఫీ డబ్బులు పడలేదు. జాబితాల్లో పేర్లు చూసుకుని ప్రతిరోజూ బ్యాం కులకు వెళ్తున్న రైతులకు నిరాశే ఎదురవుతున్నది. రెండు రోజులే మురిపించి ఆ తర్వాత రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాకపోవడంపై బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 48,239 మంది రైతులకు రూ.250 కోట్ల మేర వారి ఖాతాల్లో జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా..1500 మంది రైతులకు పైగా ఖాతాల్లో మాఫీ డబ్బులు జమ కావాల్సి ఉన్నది.
జిల్లాలో ఇదీ ‘మాఫీ’ పరిస్థితి..
- జిల్లాలో రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులు లక్షకు పైగా ఉంటారని అంచనా. అయితే ప్రస్తుతం 49,741 మందికి మాత్రమే తొలి విడతలో అవకాశం దక్కింది. మిగిలిన వా రికి తదుపరి విడతల్లో మాఫీ వస్తుందని చెబుతున్నా రైతులకు నమ్మకం కుదరడం లేదు.
- తేదీ.12.12.2018 -తేదీ. 9.12. 2023 మధ్య తీసుకున్న కొత్తరుణాలు, రెన్యూవల్ చేసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు మా త్రమే మాఫీని వర్తింపజేశారు. దీర్ఘకాలిక టర్మ్ రుణాలు, సాగుఅనుబంధ, రీషెడ్యూల్ రుణాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో చాలామందికి మొండిచెయ్యి చూపించినైట్లెంది.
- ఆధార్, రేషన్‌కార్డులతో సరిపోల్చి రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులకు రూ.లక్షలోపు రుణముంటేనే తొలి జాబితాలో ప్రకటించారు. రూ. లక్ష దాటితే రెండో జాబితాలో, రూ.1.50 లక్ష లు దాటితే మూడో దఫాలో రైతుల పేర్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
- రేషన్ కార్డు లేని వారిలో చాలామంది కుటుం బ సభ్యుల పేర్లు నిర్ధారణ జరగాల్సి ఉన్నందున వీరి పేర్లు కూడా జాబితాల్లో రాలేదు. మరోపక్క రెండు, మూడుచోట్ల రుణాలు తీసుకున్న వారి వివరాలు ఆధార్ అనుసంధానంతో వెల్లడి కావడంతో ఆయా రైతుల పేర్లు కూడా తొలి విడత జాబితాల్లో రాలేదు.
- కొన్ని బ్యాంకుల పంట రుణ ఖాతాలు ఆన్లైన్ సర్వర్‌తో అనుసంధానం లేకపోవడంతో వారి జాబితా ప్రభుత్వం వద్ద అందుబాటులో లేక బ్యాంకుల వారీగా వివరాలను తెప్పించుకుని రెండు, మూడు విడతల్లో నిధుల బదిలీని ప్రభుత్వం చేపడుతుందని అధికారులు చెబుతున్నా.. దీనిపై స్పష్టత కొరవడింది.
- ఆదాయపన్ను చెల్లిస్తున్న వారిని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోలేదు. మూడేండ్లపాటు వడ్డీ చెల్లించకపోతే మొండి బకాయిలుగా భావించిన బ్యాంకులు ఆయా ఖాతాలను ఎన్పీఏ జాబితా ల్లో చేర్చాయి. ఆ ఖాతాలకు సైతం రుణమాఫీ నిధులు రాలేదు. అసలు, వడ్డీ కలిపి రూ.లక్ష దాటినా.. ఆయా రైతుల పేర్లు రుణమాఫీ జాబితాల్లో చోటుచేసుకోలేదు.
రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు..
నేను, వ్యవసాయ పనుల నిమిత్తం కొత్తపేట పీఏసీఎస్ బ్యాంకులో రూ. 70,000 అప్పు తీసుకున్నా. ప్రస్తుతం ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. మొబైల్‌కు మెసెజ్ కూడా రాలేదు. ఎవరిని అడగాలో తెలియడంలేదు. గతంలో రుణమాఫీ అయినప్పుడు డైరెక్టుగా బ్యాంకు ఖాతాలో జమఅయ్యాయి. అధికారులు నా సమస్యకు పరిష్కారం చూపాలి. – శానమోని లక్ష్మమ్మ, మహిళా రైతు, చౌలపల్లి, కేశంపేట
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

