తుర్కయంజాల్,డిసెంబర్ 19: తుర్కయంజాల్ సర్కిల్‌ను జనాభా ప్రాతిపదికన విభజిస్తూ నూతన డివిజన్‌గా కొహెడను ఏర్పాటు చేయాలని కొహెడ జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం తుర్కయంజాల్ సర్కిల్ పరిధిలోని వార్డు కార్యాలయంలో కొహెడ జేఏసీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ తుర్కయంజాల్ సర్కిల్‌ను రెండు డివిజన్లుగా విభజించిన అధికారులు శాస్త్రీయంగా విభజన చేయలేదని, రెవెన్యూలో అతి పెద్దదైన కొహెడను డివిజన్‌గా ప్రకటించకపోవడం సరికాదన్నారు. వెంటనే అధికారులు కొహెడను నూతన డివిజన్‌గా ప్రకటించాలని లేని పక్షంలో కొహెడ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమానికి సిద్దం అవుతామని హెచ్చరించారు.
కొహెడను డివిజన్‌గా ఏర్పాటు చేయకపోవడంపై ఇప్పటికే 800లకు పైగా అభ్యంతరాలను అందజేశా మన్నారు. మరో రోజు అభ్యంతరాలు అందజేయడానికి సమయం ఉన్న అధికారులు అభ్యంతరాలు తీసుకోవడం లేదని జేఏసీ సభ్యులు వాపోయారు. సుమారు 65వేలకు పైగా ఓటర్లతో డివిజన్‌ను ఏర్పాటు చేస్తే సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కేవలం డబ్బులు ఉన్న వ్యక్తులు మాత్రమే పోటీలో ఉండే విధంగా డివిజన్ల ఏర్పాటు చేశారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితులలోనైనా కొహెడను డివిజన్‌గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కొహెడ ప్రతి ఇంటి నుంచి అభ్యంతరాలను అధికారులకు అందజేసినట్లు జేఏసీ సభ్యులు తెలిపారు.