షాద్‌నగర్‌టౌన్, డిసెంబర్ 15: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ గిరిజన గురుకుల డిగ్రీ, పీజీ మహిళా కళాశాలలో సోమవారం ఆహార ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ నీతా తెలిపారు. కళాశాల విద్యార్థినులు వివిధ రకాల వంటకాలను తయారు చేసి ఆహార ఉత్సవంలో ప్రదర్శించారు. ఆహార ఉత్సవంలో హైదరాబాద్, రంగారెడ్డి రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని విద్యార్థుల వంటకాల ప్రదర్శనను తిలకించారు.
అదే విధంగా విద్యార్థినులు తయారు చేసిన వంటకాలను రుచిచూసి విద్యార్థినులను అభినందించారు. వంటకాల తయారు చేయడంతో ఉపయోగించిన పోషకాల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కళాజ్యోతి, స్పందన, విద్యార్థినులు పాల్గొన్నారు.