ఉమ్మడి జిల్లాలో ప్రచారం హోరెత్తింది. ఏ పల్లె చూసినా గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మేళతాళాలు, డప్పుచప్పుళ్లతో అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులిచ్చి గెలుపు ఖాయమంటూ ఆశీర్వదించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించారు.
ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని సూచించారు. భారీ బైక్ ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించగా, జనం నీరాజనం పలికారు. అభివృద్ధిని చూసి కారుగుర్తుకు ఓటు వేయాలని, మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజల సేవకులుగా ఉంటామని హామీనిచ్చారు.
– రంగారెడ్డి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ)
చేవెళ్ల రూరల్, నవంబర్ 28 : చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పామెన, అల్లవాడ, అనుబంధ గ్రామం జాలాగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పల్లె ప్రగతి పనుల తదితర కార్యక్రమాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల గురించి ప్రజలకు తెలుసని, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు.
కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచ్‌లు అక్నాపురం మల్లారెడ్డి, యాలాల భీంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, తెలంగాణ ఉద్యమకారుడు దేశమొల్ల ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ శివనీలచింటు, నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ చారి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఫయాస్, బూర్ల మహేశ్, బీఆర్ఎస్ నాయకులు మద్దెల జంగయ్య, వంగ శ్రీధర్ రెడ్డి, శేరి రాజు, సాయినాథ్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : మూడు గంటల కరెంట్ ఇచ్చి రైతులకు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ కావాలో?, 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుల కండ్లలో ఆనందం చూసే బీఆర్ఎస్ కావాలో? ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ప్రచారంలో భాగంగా మంగళవారం గ్రామంలో రోడ్డు షో నిర్వహించారు. అనుబంధ గ్రామాలైన అమీర్‌గూడ, చిన్నషాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా అధికారానికి అందనంత దూరమే ఉంటుందన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి, సీనియర్ నాయకులు కొత్త నర్సింహారెడ్డి, సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ సుజాత, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, సర్పంచ్‌లు రాఘవరెడ్డి, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ డప్పు రాజు, వార్డు సభ్యులు ప్రవీణ్‌గౌడ్, నాయకులు చెన్నారెడ్డి, శ్రీశైలం, డేవిడ్, దర్గ రాజు, డేవిడ్, మందడి సత్తిరెడ్డి పాల్గొన్నారు.
కేశంపేట : ప్రజల సంక్షేమం కోసం పని చేసే నాయకులను ప్రజలు ఆదరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంతో పాటు బలిజరాళ్లతండా, నాగుర్లగడ్డతండా, పాటిగడ్డ, అల్వాల, మంగళిగూడ, పోల్కోనిగుట్టతండాలలో అంజయ్యయాదవ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణగౌడ్, నారాయణరెడ్డి, నాయకులు మురళీధర్‌రెడ్డి, విశ్వనాథం, వెంకట్‌రెడ్డి, జమాల్‌ఖాన్, యాదగిరిరావు, ప్రభాకర్‌రెడ్డి, పల్లె నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
షాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మరియాపురం, సీతారాంపూర్, చందనవెళ్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. చందనవెళ్లి, సీతారాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వివిధ పరిశ్రమలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్‌గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, కొత్త పాండురంగారెడ్డి, నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్‌లు కటికే సందీప్, విజయభాస్కర్‌రెడ్డి, ప్రమీలవెంకటేశ్, నాయకులు కొత్త సీతారాంరెడ్డి, సురేశ్‌గౌడ్, డాక్టర్ రాజు, మర్రెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్, నవంబర్ 28: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ కారుగుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కేశంపేట ఎంపీపీ వై. రవీందర్‌యాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడ మాజీ సర్పంచ్ విజయలక్ష్మీవెంకట్రెడ్డి 100మందితో మంగళవారం బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో మంగళవారం బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్య తరఫున నాయకులు, ప్రజా ప్రతినిధులు జోరుగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, అంజన్‌గౌడ్, బాల్‌రాజ్, ఎదిరె రాములు, నరేందర్ గౌడ్, మాణిje్యరెడ్డి, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
నందిగామ : మండల వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం తప్పదన్నారు.
చేవెళ్లటౌన్ : అభివృద్ధ్దిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి మరో మారు ఎమ్మెల్యేగా కాలె యాదయ్యను గెలిపించాలని ఎంపీపీ విజలయక్ష్మి, జడ్పీటీసీ మాలతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోని ఆయా కాలనీల్లో ఇంటింటికీ తిరిగి పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ చింటు, నాయకులు బాల్‌రాజ్, నత్తి కృష్ణారెడ్డి, గుత్తి మల్లేశ్, గుడిపల్లి చంద్రశేఖర్ రెడ్డి, సత్యం, రవి, కుమార్ పాల్గొన్నారు.
కొత్తూరు : పిలిసే పలికే అంజన్న కావాలో?, రెండు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఎస్పల్లిలో జడ్పీటీసీ శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. రూ. 25 కోట్లతో ఎస్బీపల్లిలో వివిధ రకాల అభివృద్ధి పనులకు చేపట్టామని చెప్పారు. అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం జడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ ఇప్పటికే గ్రామంలో 25 ఇండ్లు ఇచ్చామని చెప్పారు. ఇంకా గ్రామంలో ఎవరికైనా కావాలన్నా ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మె సత్యనారాయణ, కడల శ్రీశైతం, కుమ్మరిగూడెం పాండు, అజయ్, ముకుంద్‌రెడ్డి, ఎమ్మె నర్సింహ, అంబటి నర్సింహ తదిరుతు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 28వ వార్డు గాంధీనగర్‌కాలనీలో సీనియర్ నాయకుడు చేగూరి వేణుగోపాల్, పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మరింత అభివృద్ధి జరగాలంటే కారుగుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ప్రదీప్, యువజన అధ్యక్షుడు అభిలాష్, సీనియర్ నాయకులు సుజీవన్, రెడ్డి రమేష్, దినేశ్, మధు, రంజిత్, శ్రీకాంత్, పృథ్వీ, చరణ్, నర్సింహ, అరవింద్ పాల్గొన్నారు.