రంగారెడ్డి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ భూ హారతిలాగా మారింది. ధరణిలో అక్రమా లు జరిగాయని.. తాము అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో మంచి పోర్టల్‌ను తీసుకొచ్చి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చింది. అయితే ఈ పోర్టల్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు కావాలంటే చేతులు తడపాల్సిన దుస్థితి నెలకొన్నది. రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్.. మండలస్థాయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కానీ, కిందిస్థాయి రెవెన్యూ అధికారులు ఫైళ్లు క్లియర్ కావాలంటే ప్రతి పనికీ ఇంత రేట్ అని ఫీక్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధర ణి పోయి భూభారతి వచ్చినా తమకు ఎలాంటి ప్రయోజనం లేదని..సమస్యలూ పరిష్కారానికి నోచుకోవడంలేదని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ అధికారుల అవినీతికి మరింత సహకరిస్తున్నది. భూ భారతి సదస్సుల ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్.. కింది స్థాయి అధికారులను ఆదేశించారు. కాగా, సమస్యల పరిష్కారం పేరుతో రెవెన్యూ అధికారులు అవినీతికి తెరలేపారు. డబ్బులిస్తేనే ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని.. లేకుంటే అధికారులు నెలల తరబడిగా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల రైతుల నుంచి డబ్బులు తీసుకుంటూ తలకొండపల్లి, ఆమనగల్లు తహసీల్దార్లతోపాటు ఇబ్రహీంపట్నం ఆర్ఐ, పలువురు రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు.
వచ్చిన ఫిర్యాదుల్లో ఇప్పటివరకు సగం సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాలకు చెందిన ఆర్ఐలు రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిపోర్టును తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ పరిశీలించాల్సి ఉంటుంది. కానీ, డబ్బులు ఇవ్వనిదే ఈ ఫైళ్లు తహసీల్దార్ కార్యాలయం నుంచి కదలడంలేదని సమాచారం. ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు ఓవైపు కొరడా ఝులిపిస్తున్నా రెవెన్యూ కార్యాలయాల్లో మాత్రం అవినీతి ఆగడమే లేదు. ఈ విషయంపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో భూభారతిలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు 21 వేల వరకు దరఖాసులొచ్చాయి. వీటిలో మిస్సింగ్ సర్వేనంబర్లు, పెండింగ్ మ్యుటేషన్లు, నిషేధిత జా బితా తరతరాలు ఇలా ఉన్నాయి..
