మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణ శివారులోని ఆలీసాబ్గూడ రెవెన్యూ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వందపడకల దవాఖాన ఆవరణలో గురువారం ట్రామా కేర్, డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత, సర్పంచ్ బీష్వ మాధవి, ఎంపీటీసీ బీష్వ రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్‌తో కలిసి భూమి పూజ చేశారు.
- ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ట్రామా కేర్, డయాలసిస్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభం
షాద్‌నగర్‌టౌన్, జనవరి 26 : ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణ శివారులోని ఆలీసాబ్గూడ రెవెన్యూ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వందపడకల దవాఖాన ఆవరణలో గురువారం ట్రామా కేర్, డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత, సర్పంచ్ బీష్వ మాధవి, ఎంపీటీసీ బీష్వ రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5.26ఎకరాల్లో వందపడకల దవాఖానను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నామన్నారు. తక్షణ వైద్యం అందించడం కోసం రూ. 3కోట్లతో ట్రామా కేర్ సెంటర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారి కోసం డయాలసిస్ సెంటర్ నిర్మిస్తున్నామన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సర్పంచ్, ఎంపీటీసీ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ సర్వర్‌పాషా, ఎంపీడీవో వినయ్, డాక్టర్ శ్రీనివాస్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు నారాయణ, లక్ష్మీనారాయణ, సురేశ్, రాఘవేందర్‌రెడ్డి, చెన్నయ్య, రజినీకాంత్, దామోదర్, సలీం, రాజు, శ్రీకాంత్, రాజశేఖర్, నవీన్ పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
నందిగామ : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో తాండ్ర రామకృష్ణరెడ్డి, గోపాల్‌రెడ్డి ఆర్థిక సహకారంతో నిర్మించిన శ్రీ సాయిబాబా ఆలయంలో గురువారం శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై దేవాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్‌రెడ్డి, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ యూత్ క్యాలెండర్ ఆవిష్కరణ
నందిగామ మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

