పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 8 : మున్సిపాలిటీ పరిధి పసుమాములలోని శ్రీనివాస డెవలపర్స్ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్లో ప్లాట్లు కొన్న తమను డెవలపర్స్ మోసం చేశారని బాధితులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని ఆదివారం లేఅవుట్ ప్రాంతంలో టెంటు వేసుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు నవీన్‌రెడ్డి, రమాదేవితోపాటు పలువురు మాట్లాడుతూ.. పసుమాముల సర్వేనంబర్ 94, 100 లో 2019లో సుమారు 10.14 ఎకరాల్లో శ్రీనివాస డెవలపర్స్ పేరిట లేఅవుట్ చేయగా.. అందులో 250 మంది వరకు ప్లాట్లు కొన్నామన్నారు.
పట్టాదారుల వద్ద భూమిని జీపీఏ చేసుకున్న డెవలపర్స్.. ప్లాట్లన్నీ అమ్మేశారన్నారు. అయితే, పట్టాదారులకు పూర్తిగా డబ్బులు చెల్లించకపోవడం తో వారు 10.14 ఎకరాల్లోంచి తిరిగి నాలుగు ఎకరాల భూమిని స్వా ధీనం చేసుకోవడంతోపాటు నాలా కన్వర్షన్ అయిన భూమిని తిరిగి ధరణి పోర్టల్‌లో ఎక్కించుకున్నారని, ఆరు నెలల కింద ప్లాట్ల హద్దురాళ్లను కూ డా తొలగించారని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని డెవలపర్స్ దృష్టికి తీసుకెళ్తే తమకు సంబంధం లేదని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాధితులు యాదగిరిరెడ్డి, మల్లేశ్, శ్రవంతి, మహేందర్, సాయితేజ, శ్రీనివాస్, విజయ్‌కుమార్, పృథ్వీరాజ్‌రెడ్డి, కమల్, జంగారెడ్డి, శోభారాణి పాల్గొన్నారు.