Tenth Get together | నందిగామ, జూన్ 1 : నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన 1994-95 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఈదులపల్లిలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పట్లో విద్య బోధించిన ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ప్రహ్లాద్‌లను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. అనంతరం అలనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాను. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.