కడ్తాల్, ఆగస్టు 29 : గిరిజనుల సంస్కృతీసంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. గు రువారం మండలంలోని గాన్గుమార్ల తండాలో గిరిజనులు నిర్వహించిన తీజ్ ఉత్సవంలో సబితారెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరె డ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భం గా సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో గిరిజనులు జరుపుకొనే తీజ్ పండుగకు ఎం తో ప్రాధాన్యమున్నదన్నారు.
పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ..గిరిజనులకు తీజ్ పం డుగ ఎంతో ప్రీతికరమైనదన్నారు. అనంతరం యువతులు తయారు చేసిన మొలకల బుట్టలను ప్రజాప్రతినిధులు నెత్తిన ఎత్తుకున్నారు. సాయంత్రం యువతులు బుట్టలను ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్య స్థానిక ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యువతీయువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆ బుట్టలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశా రు.
కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, వెంకటేశ్, విజితారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు హన్మానాయక్, సేవ్యానాయక్, శంకర్‌నాయక్, శ్రీనూనాయక్, మాజీ సర్పంచ్ లు లక్ష్మీనర్సింహారెడ్డి, హంశ్యామోత్యానాయక్, రాములునాయక్, శేఖర్‌గౌడ్, నరేందర్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ గిరిజన యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్‌నాయక్, నాయకులు వీరయ్య, లాయక్‌అలీ, భాస్కర్‌రెడ్డి, నర్సింహ, బీక్యానాయక్, బీచ్చానాయక్, యాదరిగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాజూనాయక్, లక్పతినాయక్, భీమన్నాయక్, శంకర్, లక్ష్మణ్, హీరాసింగ్, రాజునాయక్, రతన్, పాండునాయక్, జగ న్, సాయిలాల్, కిషన్, సక్రూనాయక్, భాస్కర్, తండావాసులు పాల్గొన్నారు.