ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి
రంగారెడ్డి జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ కంటే ఎక్కువ జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులను వెనక్కి పంపి ప్రస్తుత ప్రమోషన్, బదిలీల్లో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 24 : రంగారెడ్డి జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ కంటే ఎక్కువ జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులను వెనక్కి పంపి ప్రస్తుత ప్రమోషన్, బదిలీల్లో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, బీటీఎఫ్ సంఘాల ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లగూడెం మహేశ్, తిరుమలేశ్, కిరణ్, దామోదర్, రామకృష్ణ, రాజు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
యాచారం : జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్‌కు మించి ఇచ్చిన ఉపాధ్యాయ పోస్టులను సరిచేసి, అన్ని జిల్లాల మాదిరిగా పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని గున్గల్, మాల్, కుర్మిద్ద, బొల్లిగుట్టతండా, ధర్మన్నగూడ, నల్లవెల్లి, మేడిపల్లి, నందివనపర్తి, నానక్‌నగర్, మొగుళ్లవంపు, మంథన్‌గౌరెల్లి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు యూఎస్పీఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు అంజయ్య, ప్రధానకార్యదర్శి నర్పింహ మాట్లాడుతూ.. బదిలీలు, పదోన్నతుల విషయంలో జిల్లా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగకుండా చూడాలన్నారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మంచాల : స్థానిక ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో తీవ్ర నష్టం జరిగిందని, స్థానికులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం మంచాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాన్ని జూనియర్ అసిస్టెంట్ నాగరాజుకు అందజేశారు. వారి వెంట ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజిరెడ్డి, రమేశ్, రాములు, సీతారాం, బాలూనాయక్, జహీర్, గఫర్, శ్రీనివాస్, రాజమల్లేశ్, బాల్‌రాజ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
వెంటనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలి
ఆమనగల్లు : జిల్లాలో వెంటనే ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయునులు సుశీల, ప్రేమకుమారి పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో..
చేవెళ్లటౌన్ : జిల్లాకు ప్రమోషన్లు, బదిలీలపై వచ్చిన ఉపాధ్యాయులను వెంటనే వారి వారి జిల్లాలకు బదిలీలు చేసి, పదోన్నతులు ప్రస్తుత షెడ్యుల్‌లో చేపట్టాలని సోమవారం చేవెళ్ల మండలం కేంద్రంలో ఉపాధ్యాయులందరూ కలిసి తహసీల్దార్ కృష్టయ్యకు వినతి పత్రం అందజేశారు. వీరి వెంట రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : స్థానిక ఉపాధ్యాయులకే జిల్లాలో ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ మజీద్‌పూర్ గ్రామంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సోమవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
స్థానికులకే అవకాశం కల్పించాలి
షాబాద్ : ప్రమోషన్, బదిలీలో రంగారెడ్డిజిల్లాకు చెందిన స్థానిక ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని పీఆర్టీయూ టీఎస్ షాబాద్ మండల అధ్యక్షుడు కడ్మూరి సుదర్శన్ అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని హైతాబాద్, తాళ్లపల్లి, షాబాద్ తదితర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమోషన్, బదిలీలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ, హెచ్ఎం గోవింద్, ఉపాధ్యాయులు ఎల్. నర్సింహులు, ఆంజనేయులు, రియాజ్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : మండల పరిధిలోని అంతారం జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామారావు, ఉపాధ్యాయులు పరిగి మల్లేశ్‌కుమార్, హతిరామ్, మాణిక్యరావు, నర్సింహులు, హని, ఉష, రేష్మా, సరిత, జ్యోతి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

