శనివారం 23 జనవరి 2021
Rangareddy - Dec 05, 2020 , 02:31:45

పనులు త్వరలోనే పూర్తి

పనులు త్వరలోనే పూర్తి

ఘట్‌కేసర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించిన కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌: రవాణా సౌకర్యాన్ని మరింత సులభం చేసేందుకు కృషి చేస్తున్నామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రెండేండ్ల క్రితం ఆగిపోయిన ఘట్‌కేసర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫై ్లఓవర్‌ నిర్మాణానికి స్థలాలు కోల్పోయిన బాధితులకు సరైన న్యాయం జరుగకపోవడంతో కొంతమంది కోర్టుకు వెళ్లగా, పనులు నిలిచి పోయాయన్నారు. ప్రస్తుతం బాధితులకు స్థలంతో పాటు, నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుందని, ఈ మేరకు బాధితులు అంగీకారం తెలుపడంతో నిర్మాణ పనులు ఆటంకం లేకుండా కొనసాగనున్నాయన్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కొండాపూర్‌, కీసర, శామీర్‌పేట్‌, మేడ్చల్‌ వరకు వెళ్లే వాహనదారులకు సౌకర్యంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావనీ జంగయ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ పి.మాధవరెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బి.శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, రైతు సంఘం మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ బీసీ కమిటీ అధ్యక్షుడు హరిశంకర్‌, నాయకులు ముల్లి జంగయ్యయాదవ్‌, మాజీ సర్పంచ్‌ యాదగిరి యాదవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo