రంగారెడ్డి జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. ప్రతి గింజనూ సేకరించడమే లక్ష్యంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వానకాలానికి సంబంధించి జిల్లాలో 1,25,456 ఎకరాల్లో వరిసాగవ్వగా.. 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. అందుకోసం జిల్లావ్యాప్తంగా 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 826 మంది రైతుల నుంచి రూ.28 కోట్ల విలువ చేసే 13,620 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్పటికే రూ.9.24కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, మిగతా డబ్బులను వీలైనంత తొందరలో చెల్లించే దిశగా అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఏ-గ్రేడు రకం ధాన్యం క్వింటాల్‌కు రూ. 2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర చెల్లిస్తున్నారు. జనవరిలోగా ధాన్యం సేకరణ పూర్తి చేసే దిశగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతున్నది.
షాబాద్, డిసెంబర్ 16: రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రభు త్వం ముందుకు సాగుతున్నది. జిల్లాలో ఈ వానకాలంలో 1,25,456 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. సుమారు నెల రోజులుగా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. అక్కడ అధికారులు రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జనవరిలోపు ధాన్యం సేకరణను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఏ-గ్రేడు రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ. 2,040 ప్రభుత్వం మద్దతు ధరను చెల్లిస్తున్నది. దళారుల బెడద లేకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి మద్దతు ధర చెల్లిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
13,620 మెట్రిక్ టన్నులు..
జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఆమనగల్లు(కల్వకుర్తి) , శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 26 మండలాల్లో ఈ ఏడాది వానకాలంలో రైతులు 1,25,456 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం జిల్లాలో 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిం ది. పీఏసీఏస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 36, ఐకేపీ ఆధ్వర్యంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 826మంది రైతుల నుంచి 13,620 మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెబుతున్నారు. సేకరించిన ధాన్యం విలువ రూ.28 కోట్లు ఉండగా.. అందులో ఇప్పటివరకు రూ.9.24 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు. ఆన్లైన్లో నమోదు కాగానే మిగతా రైతులకూ సకాలంలో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొంటున్నారు.
ప్రతి గింజనూ కొంటాం..
వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించిం ది. నిబంధనలు పాటిస్తూ రైతులకు మద్దతు ధరను కల్పిస్తున్నది. అంతేకాకుండా రైతులకు డబ్బులు త్వ రగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు. పౌర సరఫరా, సహకార, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వ యం చేసుకొని ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు.
ఇప్పటివరకు 13,620 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. టార్పాలిన్లు, సంచులను అందు బాటులో ఉంచాం. జిల్లాలో వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఇప్పటివరకు 826 మంది రైతుల నుంచి 13, 620 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిం చి.. రూ.9.24 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఈ వానకాలంలో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
-శ్యామారాణి, రంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్