Tandur : అదనపు బస్సులను కేటాయించండి.. ఆర్టీసీ చైర్మన్‌ను కోరిన ఎమ్మెల్యే

తాండూరు : తాండూరు ఆర్టీసీ డిపోకు అదనంగా బస్సులను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డిని ఎమ్మెల్యే ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తాండూరు ఆర్టీసీ డిపో సమస్యలపై చర్చించారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అదనపు బస్సులు కేటాయిస్తే విద్యార్థులకు పాఠశాల, కళాశాలల సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడిపేలా చూడాలన్నారు. ఇందుకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి స్పందించి ప్రభుత్వం నుంచి కొత్త బస్సులు వచ్చిన వెంటనే తాండూరుకు మరిన్ని బస్సులు కేటాయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అప్పటి వరకు డిపోలో ఉన్న బస్సులతో సమయానుకూలంగా బస్సులు నడిపించి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్ ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

