ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. పైసా ఖర్చులేకుండా పేదలకు మెరుగైన వైద్యమందేలా చర్యలు తీసుకుంటున్నది. చికిత్సనే కాకుండా కొండాపూర్ ఏరియా దవాఖానలో టీ డయాగ్నస్టిక్ ఏర్పాటు చేసి రోగ నిర్ధారణ పరీక్షలను కూడా ఉచితంగా చేస్తున్నది. మొత్తం 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు ఎక్స్‌రే, అల్ట్ట్రాసౌండ్, మమో్రగ్రఫీ, ఈసీజీ వంటి ఖరీదైన రేడియాలజీ టెస్టులనూ చేస్తున్నది. ఈ టెస్టులకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో రూ.3వేల వరకు ఖర్చు కానుండగా.. ప్రభుత్వం ఉచితంగానే సేవలను అందిస్తున్నది. ల్యాబ్ ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలోనే 11వేల మందికి పైగా రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటివరకు రూ.3కోట్ల విలువగల టెస్టులన్నీ ఫ్రీగా చేసింది. ప్రభుత్వ చర్యలతో వైద్య పరీక్షల పేరిట ప్రైవేటు దవాఖానలు చేస్తున్న దోపిడీకి చెక్ పడింది. ఇంతకుముందు 57 రకాల పరీక్షలను మాత్రమే చేయగా.. జూలై మొదటి వారం నుంచి 134 రకాల టెస్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. టీ-డయాగ్నస్టిక్ ల్యాబ్‌లతో టెస్టుల ఖర్చు భారం తప్పిందని జిల్లా ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రజల కోసం కొండాపూర్ ఏరియా దవాఖానలో తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి న టీ డయాగ్నస్టిక్ సెంటర్ అద్భుతమైన సేవలను అందిస్తున్నది. అందులో 134 రకాల వైద్య పరీక్షలను ఫ్రీగా అందిస్తున్నది. వీటితోపాటు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, మమోగ్రామ్, ఈసీజీ వంటి రేడియాలజీ టెస్టులు కూడా పూర్తి ఉచితం. ఈ పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లలో రూ.3 వేల వరకు ఖర్చుఅవుతుంది. ఈ సెంటర్ ప్రారంభమైన రెండు నెలల వ్య వధిలోనే 11వేల మందికి పైగా రూ. మూడు కోట్ల విలువైన రక్త పరీక్షలను ఉచితంగా చేయించుకున్నా రు. ప్రభుత్వం పేదలపై చూపుతున్న ఔదార్యంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువ చేస్తున్నది. పేదలకు రోగనిర్ధారణ పరీక్ష ఫీజు ల భారాన్ని తగ్గించి.. టెస్టుల పేరిట ప్రైవేట్ దవాఖానల దోపిడీకి చెక్ పెట్టేందుకు అన్ని జిల్లాల్లోనూ టీ-డయాగ్నస్టిక్ సెంటర్లను సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. జిల్లాకు మంజూరైన సెంటర్‌ను కొండాపూర్ ఏరియా దవాఖానలో జూలై మొదటి వారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇం తకుముందు ల్యాబ్‌లో 57రకాల పరీక్షలను ఉచితంగా అందించగా.. ప్రస్తుతం 134కు ప్రభుత్వం పెంచింది. వీటితోపాటు పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్‌ల సేవలు అదనం.
కొండాపూర్‌లో సెంటర్ ప్రారంభమైన నాటి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 11,312 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎక్స్‌రే 429 మంది కి, అల్ట్రాసౌండ్ టెస్టులు 611 మందికి, మమోగ్రా మ్ టెస్టులు 130 మందికి, ఈసీజీ 89 మంది చేయించుకున్నారు. సాధారణంగా జ్వరం వచ్చిన వ్యక్తి ప్రైవేట్ దవాఖానకెళ్తే తప్పనిసరిగా సీబీపీ, వైడల్, మలేరియా, యూరిన్ తదితర పరీక్షలను చేస్తారు. వీటికి కనీసం రూ. వెయ్యి వరకు ఖర్చవుతుంది. ఇక అల్ట్రాసౌండ్, మమోగ్రామ్ వంటి టెస్టులకు రూ.3 వేలకు పైగానే చెల్లించాల్సిందే. ఈ రెం డు నెలల కాలంలో 11,312 మంది పేషెంట్లు రూ. మూడు కోట్ల విలువైన రక్త పరీక్షలను ఉచితంగా చేయించుకున్నారు.
జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్ట ణ ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రా లు ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నాయి. వీటితోపాటు 59 బస్తీ దవాఖానలు, 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 82 పల్లె దవాఖానలు విస్తృత సేవలను అందిస్తున్నాయి. ఏ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరమైనా స్థానికంగా ఉన్న దవాఖానల్లోనే రక్త నమూనాలను సేకరిస్తున్నారు. సేకరించిన ఈ శాంపిల్స్‌ను కొండాపూర్‌లోని టీ-డయాగ్నస్టిక్ ల్యాబ్‌కు పంపుతున్నారు. ఈ కేంద్రం లో జరిగే ప్రతి పరీక్షనూ రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. వీటిని తిరిగి స్థానిక ప్రభుత్వ దవాఖానలకు నివేదిస్తున్నారు. సంబంధిత రిపోర్టులను రోగుల సెల్ఫోన్లకు 24 గంటల్లోనే మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. గతంలో పేదలకు టెస్టుల కోసమే తడిసి మోపయ్యేది. టీ-డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుతో ఆ భారం త ప్పిందని జిల్లాప్రజలు సంతో షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఖర్చులకు భయపడి టెస్టులు చేయించుకోకపోవడం తో వ్యాధి ముదిరి ప్రా ణాంతకంగా మారేది. ప్రభుత్వమే ఉచితంగా అన్ని రకాల టెస్టులను చేయడం ద్వారా వ్యా ధులను ప్రారంభ దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించే అవకాశం కలుగుతున్నది. సేకరించిన నమూనాలను టీ-డయాగ్నస్టిక్ సెంటర్ కు తీసుకొచ్చేందుకు త్వరలో ఏడు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వీటివల్ల డయాగ్నస్టిక్ సేవలు మరింత విస్తరించనున్నాయి. వ్యా ధి నిర్ధారణ పరీక్షల భారం తప్పించేందుకు ప్రభు త్వం ఏర్పాటు చేసిన టీ-డయాగ్నస్టిక్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
-వెంకటేశ్వరరావు, రంగారెడ్డి డీఎంహెచ్‌వో