మొయినాబాద్, అక్టోబర్ 21 : ‘ఎన్నికల ముందు అందరు మీ ఇండ్ల ముందుకు వస్తారు.. 60 ఏండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేసి చూపెడుతామని ఎన్నో మాయ మాటలు చెబుతారు.. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి గోసపడోద్దు’ అని ఎమ్మెల్యే, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని మేడిపల్లి, చిన్నమంగళారం, మోత్కుపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికీ తిరిగారు. ఆయా గ్రామాల్లో ప్రచార సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి అనేక సంక్షేమ పథకాలను వ్రవేశపెట్టారని తెలిపారు. ఆ పథకాలు శాశ్వతంగా కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోనికి వచ్చి కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయితేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వారికి సన్న బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. చిన్నమంగళారం గోపులారం మధ్య ఉన్న మూసీ వాగుపై వంతెన నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేశామని, వంతెన నిర్మాణం కోసం న్యాయపరమైన చిక్కులు ఎదురై వాటిని అధిగమించి వంతెన పనులను మొదలు పెట్టామన్నారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నుంచి వయా ముడిమ్యాల , రావులపల్లి, మేడిపల్లి గ్రామాల మీదుగా పొద్దుటూరు గేట్ వరకు కొత్తగా రోడ్డు చేయడానికి ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
రెడ్డిపల్లి, మోత్కుపల్లి గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి నిధులను మంజూరు చేశామని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్‌రెడ్డి, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, చిన్నమంగళారం సర్పంచ్ గడ్డమీది సుకన్య, ఎంపీటీసీ బట్టు మల్లేశ్, ఉపసర్పంచ్ గోపాల్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నడిమింటి రాములు, మేడిపల్లి ఎంపీటీసీ అంజయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ యాదయ్య, మోత్కుపల్లి సర్పంచ్ కె రత్నం, ఉపసర్పంచ్ కిరణ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, సుధాకర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, మాజీ వైస్ చైర్మన్ దారెడ్డి వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకుడు గణేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆదరించండి
కేశంపేట : తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కోనాయపల్లి, సంతాపూర్, కొత్తపేటలలో ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి ప్రస్తుతం మన కండ్ల ముందు కనిపిస్తుందని తెలిపారు. ముఖ్యంగా కేశంపేట మండలంలోని బీటీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, దళితబంధు, బీసీ బంధు, కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ఫండ్ల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకువచ్చామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల్లో మహిళలు, యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి అంజయ్యయాదవ్‌కు మద్దతు పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, కృష్ణయ్య, ఎంపీటీసీలు రాజు, మల్లేశ్‌యాదవ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, బీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు యాదగిరిరావు, నారాయణరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నర్సింగ్‌రావు, వెంకన్నయాదవ్, భూపాల్‌రెడ్డి, యాదయ్యగౌడ్, శేఖర్ , శేఖర్‌రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లు, నాయకులు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పేద ప్రజల అభ్యన్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల కోసం ఎవరూ ఊహించని స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు పులిమామిడి లత, జీటీ శ్రీనివాస్, రాజేశ్వర్, బచ్చలి నర్సింహ, శ్రీనివాస్, అంతయ్య, గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు శ్రీశైలంగౌడ్, జూపల్లి శంకర్, శేఖర్, యాదగిరి, ఏజాజ్, రాఘవేందర్, రమేశ్, శేఖర్, పిన్నమోని గోపాల్, శివాజీ, రాజశేఖర్, సిద్ధు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : రానున్న రాష్ట్ర ఎన్నికల్లో ముడోసారి బీఆర్ఎస్ విజయం సాధించాలని కాంక్షిస్తూ మున్సిపల్ చైర్మన్ నరేందర్ దంపతులు ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎలికట్ట భవానీమాత ఆలయంలో శనివారం పూజలు నిర్వహించారు. అమ్మవారికి రూ.లక్ష విలువగల వెండి కిరీటాన్ని అందజేసి మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మూడోసారి విజయం సాధించడం ఖాయమన్నా రు. కార్యక్రమంలో మల్లేశ్, రాఘవేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
నందిగామ : షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని, ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.
షాద్‌నగర్‌టౌన్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని అంబర్ పేట శంకర్ ఓటర్లను అభ్యర్థించారు. మున్సిపాలిటీలోని నెహ్రూనగర్కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు శనివారం ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు. కారుగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపించాలని, షాద్‌నగర్ మరింత అభివృద్ధి వై. అంజయ్యయాదవ్తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, నాయకులు చెన్నయ్య, శేఖర్, స్థానికులు పాల్గొన్నారు.
కొత్తూరు : అభివృద్ధికి పట్టం కట్టిన బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ అన్నారు. కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, పెంటనోళ్ల యాదగిరి, మిట్టూనాయక్, సర్పంచ్ అజయ్‌నాయక్, సిరాజ్, రశీద్, లావుడ్య గోపాల్‌నాయక్, శ్రీరాయులుయాదవ్, ఇంద్రసేనారెడ్డి, సతీశ్గుప్తా పాల్గొన్నారు.