షాద్‌నగర్, అక్టోబర్18 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతివ్వాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కోరారు. బుధవారం షాద్‌నగర్ మున్సిపాలిటీలోని చటాన్‌పల్లి గ్రామంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, వెంకట్రాంరెడ్డి, జీటీ శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, నాయకులు కందివనం సూర్యప్రకాశ్, అశోక్‌యాదవ్, ప్రభాకర్, పాండురంగారెడ్డి, సుధాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి
మొయినాబాద్ : బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని అజీజ్‌నగర్, మొయినాబాద్, అమ్డాపూర్, ముర్తుజాగూడలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని కోరారు. ప్రతి నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సంధ్య, కరీమాబీమహబూ బ్, బూర్గు రవళి, సప్పిడి మాణెమ్మ, కిరణ్, ఎంపీటీసీ సుజా త, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, సుధాకర్‌యాదవ్, బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ శ్రీహరియాదవ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రమేశ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ముజ్జు, మాజీ వైస్ ఎంపీపీ జీఎన్ రాజు, దర్గ రాజు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.