జిల్లాలో గ్రామ సీమల ప్రగతి ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లతోపాటు వివి ధ పథకాల కింద గ్రామాలకు పుష్కలంగా నిధులు రావడంతో పలు అభివృద్ధి పనులను సర్పంచ్లు చేపట్టారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చి.. ప్రభుత్వం మారి.. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగా.. గ్రామాల అభివృద్ధికి నిధులను విడుదల చేయడం లేదు. పంచాయతీల్లో నిధులున్నా విత్డ్రా చేయలేని దుస్థితి నెలకొన్నది. దీంతో పల్లెల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఎక్కడి చెత్త ఎక్కడే ఉంటున్నది. మురుగు రోడ్లపై పారుతుండడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జిల్లాలో 549 గ్రామ పంచాయతీలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కింద నిధులు కేటాయించి గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, అం డర్గ్రౌండ్ డ్రైనేజీలు, వైకుంఠధామాల నిర్మాణం, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, చెత్త సేకరణ కు ప్రతి గ్రామపంచాయతీకీ ఒక్కో ట్రాక్టర్ చొప్పున కేటాయించారు. అయితే ప్రభు త్వం మారడంతో పంచాయతీలకు నిధుల విడుదల ఆగిపోవడంతో ప్రగతి పనులు ఎక్కడికక్కడే నిలిచిపో యాయి. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొన్నది. డీజిల్ కోసం పంచాయతీల నుంచి ఇచ్చిన చెక్కులకు సంబంధించిన డబ్బులు డ్రా కాకపోవడంతో పెట్రోల్ బం క్ల నిర్వాహకులు డీజిల్ పోయ డం లేదు. దీంతో ట్రాక్టర్లు నిర్వహణ లేక మూలనపడ్డాయి. వాటి డ్రైవర్లకు జీతాలూ చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. అలాగే, పారిశుధ్యం, తాగునీరు బిల్లుల చెల్లింపు, వీధిదీపాల నిర్వహణకూ నిధుల్లేని దుస్థితి ఏర్పడింది. రేవంత్ ప్రభు త్వం నుంచి నిధులురాక.. పన్నులు వసూలు కాక తీవ్ర సంక్షోభంలో గ్రామపం చాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొంతకాలంగా గ్రామాల అభివృద్ధికి స్టేట్ఫైనాన్స్ కార్పొరేషన్, 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకపోవడంతో వాటి నిర్వహణ భారంగా మారింది.
ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. గత కొన్ని నెలలుగా గ్రామపంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ప్రత్యేకాధికారులు గ్రామాలకు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. సమస్యల పరిష్కారంతోపాటు నిధు లు తీసుకురావడంలోనూ శ్రద్ధ చూపడంలేదనే ఆరోపణలున్నాయి. కేవలం పంచాయతీల్లో ఉన్న నిధుల నుంచి జీతభత్యాలు మాత్రమే ఇస్తున్నారు. ఇతరత్రా కార్యక్ర మాలు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక గ్రామాల్లోని ట్రాక్టర్లు చెడిపోయాయి. వాటిని మరమ్మతు చేయించేందుకూ నిధుల్లేని పరిస్థితి ఉన్నది. మరోవైపు గ్రామాల్లో మురుగు రోడ్లపై ప్రవహిస్తున్నా పరిష్కరించేందుకు అవసరమైన నిధుల్లేని పరిస్థితి. రేవంత్ సర్కార్ స్పందించి గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాయి. ప్రత్యేకాధికారులు చుట్టపుచూపులా వచ్చి పోతున్నారే తప్పా.. సమస్యల పరిష్కారానికి చొర వ చూపడంలేదు. కేసీఆర్ హ యాంలో గ్రామాలు అభివృద్ధిలో ముందు ఉన్నాయి. కానీ, రేవంత్ సర్కార్ గ్రామాల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు.
పంచాయతీల్లో నిధులున్నా..వాటిని డ్రా చేసుకోని పరిస్థితి నెలకొన్నది.దీంతో గ్రామాలు నిధుల్లేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంలేదు. ప్రత్యేక అధికారులు అప్పుడప్పుడు వచ్చి పోతున్నారు.