MLA malreddy rangareddy | నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేనూ చేస్తా.. మల్ రెడ్డి రంగారెడ్డికి కాలనీ అధ్యక్షురాలు సవాల్
MLA malreddy rangareddy | నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఆయన రోడ్లు వేస్తడట.. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి.. నేను మా కాలనీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తా అని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి శ్రీరంగాపురం కాలనీ ప్రెసిడెంట్ సవాల్ విసిరారు.
MLA Malreddy Rangareddy | కాలనీని అభివృద్ధి చేయమని అడిగేందుకు వెళ్తే తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని అన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి కాలనీ మహిళా ప్రెసిడెంట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాది ఇంజాపూర్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీ (24వ వార్డు). నన్ను అందరు కలిసి ఎన్నుకున్నారు అందరూ కలిసి నన్ను కాలనీ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు.. ఆదివారం మా ఎమ్మెల్యే దగ్గరికిపోయినం.. మేం ఓట్లేసి గెలిపించిన మా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దగ్గరకు మేమంతా మహిళలు 25 మంది కలిసి పోయినం.. సార్ మా కాలనీ అభివృద్ధి చేయండి.. మా దగ్గర ఒక్క సీసీ రోడ్డు లేదు.. మా కాలనీ మొత్తం వెనక పడిపోయింది. మా కాలనీలో రోడ్లు లేవు.. స్కూల్ బస్సులు పోయేందుకు లేదు.. ఆడవాళ్లు కూరగాయలకు వెళ్లేందుకు లేదు.. మా కాలనీ అభివృద్ధి చేయండి.. సీసీ రోడ్లు వేయండి అని అడిగినం. నువ్వు కాలనీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయి అని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అంటున్నడు.. మహిళలు ప్రెసిడెంట్ పదవులకు పనికి రారా..? మహిళల ఓట్లు నీకొద్దా..అంటే నేను మహిళనేనా..? అని ప్రశ్నించారు.
నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఆయన రోడ్లు వేస్తడట.. ప్రెసిడెంట్ పదవికి రోడ్లకు సంబంధమేంటి..? మమేం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే అని ఆశీర్వాదం తీసుకుందామని.. 25 మందిని తీసుకొని పోతే నువ్వు కాలనీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయంటున్నవ్ కదా.. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి.. నేను మా కాలనీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తా అని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి సదరు కాలనీ ప్రెసిడెంట్ సవాల్ విసిరారు.
“నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేను కాలనీ అధ్యక్షురాలిగా రాజీనామా చేస్తా”
వరుస వివాదాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
మల్రెడ్డి రంగారెడ్డికి కాలనీ మహిళా ప్రెసిడెంట్ కౌంటర్
మాది ఇంజాపూర్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీ (24వ వార్డు). నన్ను అందరు కలిసి కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు
కాలనీవాసులతో కలిసి అభివృద్ధి పనులు చేయమని అడిగేందుకు మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి వెళ్తే నన్ను రాజీనామా చేయమని అన్నాడు
ముందు నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నేను కాలనీ ప్రెసిడెంట్గా రాజీనామా చేస్తాను
మేము ఎన్నుకున్న నాయకుడిని అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే రాజీనామా చేయమని అడగడం ఎంతవరకు కరెక్ట్?
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2026
Read Also :
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA malreddy rangareddy | నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేనూ చేస్తా.. మల్ రెడ్డి రంగారెడ్డికి కాలనీ అధ్యక్షురాలు సవాల్
SUV Snatched: గన్పాయింట్లో బెదిరించి.. ఎస్యూవీతో పరారీ.. సరిహద్దులో అలర్ట్
Donga Naa Koduku | లాభాల్లోకి మౌళి ‘డీఎన్కే’.. మూడు రోజుల్లోనే రూ.10.15 కోట్ల వసూళ్లు!
పోక్సో చట్టం, బాలల హక్కులపై విద్యార్థినులకు అవగాహన
‘కేఓసీ హెచ్డీ ఓబీలో పాత కార్మికులకే ఉపాధి కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

