SUV Snatched: గన్‌పాయింట్‌లో బెదిరించి.. ఎస్‌యూవీతో పరారీ.. సరిహద్దులో అలర్ట్
SUV Snatched: డ్రైవర్ ఛాతిలో గన్‌పాయింట్‌లో బెదిరించి ఎస్యూవీ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పఠాన్‌కోట్-జమ్మూ జాతీయ రహదారిపై ఉన్న ఫుడ్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు జరిగింది. దీంతో పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భద్రతను పెంచారు.
పఠాన్‌కోట్: గన్‌పాయింట్‌లో బెదిరించి ఓ ఎస్‌యూవీని ఎత్తుకెళ్లారు(SUV Snatched). ఈ ఘటన పఠాన్‌కోట్-జమ్మూ జాతీయ రహదారిపై జరిగింది. ఫుడ్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఆ వాహనాన్ని ఉగ్రదాడికి వాడుతారన్న అనుమానంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. డ్రైవర్ ఛాతిలోకి ఓ వ్యక్తి పిస్తోల్ చూపి, మహేంద్ర ఎక్స్‌యూవీ500 వాహనంతో పరారీ అయ్యాడు. ఎస్పీ మన్‌ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
వెహికల్‌ను స్నాచింగ్ తర్వాత నిందితుడు పంజాబ్ దిశగా వెళ్లినట్లు తేల్చారు. గుర్తు తెలియని వ్యక్తిపై సుజన్పుర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేయనున్నారు. ఈ ఘటనతో అప్రమత్తత ప్రకటించారు. 2015లో దీనానగర్‌లో మిలిటెంట్లు ఓ కారును హైజాక్ చేసి దాంతో పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. ఆ తర్వాత 2016లో పఠాన్‌కోట్‌లో వాహనాలను హైజాక్ చేసి ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. డౌన్‌టౌన్ 44 షాపింగ్ మాల్‌కు తన భార్య , కుమార్తెతో కలిసి వెళ్లినట్లు బాధిత వ్యక్తి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SUV Snatched: గన్‌పాయింట్‌లో బెదిరించి.. ఎస్‌యూవీతో పరారీ.. సరిహద్దులో అలర్ట్
Donga Naa Koduku | లాభాల్లోకి మౌళి ‘డీఎన్‌కే’.. మూడు రోజుల్లోనే రూ.10.15 కోట్ల వసూళ్లు!
పోక్సో చట్టం, బాలల హక్కులపై విద్యార్థినులకు అవగాహన
‘కేఓసీ హెచ్డీ ఓబీలో పాత కార్మికులకే ఉపాధి కల్పించాలి’
Amitabh Bachchan | ‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్,అసలేం జరిగింది?
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

