శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. వైష్ణవ ఆలయాల్లో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి రకరకాల తీపి వంటకాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఏ పల్లెలో చూసినా చిన్ని కృష్ణులు, గోపికల వేషధారణలో చిన్నారులు చూపరులను అలరింపజేశారు. కోలాటం, భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొన్నది. అనంతర ఉట్లు కొట్టే కార్యక్రమాలు ఆసక్తికరంగా కొనసాగాయి. విజేతలకు పలువురు ప్రముఖులు బహుమతులను అందజేశారు.