షాద్‌నగర్‌రూరల్, సెప్టెంబర్ 1: ఫరూఖ్‌నగర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంబా భవానీమాత దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఈ ఫంక్షన్‌హాల్ నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. అదే విధం గా దేవాలయాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో తోడ్పాటును అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో భక్తులు శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు.